తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మహిళల ఆరోగ్యం కాపాడుతూ, పొగబారి నుంచి మహిళలను విముక్తి కల్పించడం మహాలక్ష్మీ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ ప్రకారం… ప్రజా పాలన దరఖాస్తు చేసుకుని ఉన్నవాళ్లు అర్హులు కానున్నారు.
Advertisement
తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు అర్హులు అవుతారు. గ్యాస్ కనెక్షన్ మహిళా పేరు మీద ఉండాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోనుంది ప్రభుత్వం. సబ్సిడీ గ్యాస్ పేమెంట్ ను ప్రభుత్వం ప్రతినెలా ఆయా గ్యాస్ కంపెనీలకు చెల్లింపులు చేస్తుంది. అయితే కేవలం మహిళలకు మాత్రమే మహాలక్ష్మి పథకం ద్వారా గ్యాస్ సబ్సీడీని ప్రభుత్వం అందజేస్తుంది. ఒకవేళ పేదరికం ఉన్న పురుషుల పేరిట ఉన్న గ్యాస్ వినియోగదారులకు ఈ పథకం వర్తించదా అనే తర్జన భర్జనలో ఉన్నారు ప్రజలు. దీనిపై ప్రభుత్వం ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Advertisement
- ప్రజా పాలన దరఖాస్తు చేసుకుని ఉన్నవాళ్లు అర్హులు
- తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు అర్హులు
- గ్యాస్ కనెక్షన్ మహిళా పేరు మీద ఉండాలి
- గడిచిన మూడు సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం
- సబ్సిడీ గ్యాస్ పేమెంట్ ను ప్రభుత్వం ప్రతినెలా ఆయా గ్యాస్ కంపెనీలకు చెల్లింపు
Also Read : సాయిపల్లవితో మరో సినిమా చేయను.. మెగా హీరో కామెంట్స్ వైరల్..!