Home » APPSC JOB Notification: ఏపీలోని నిరుద్యోగుల‌కు అలెర్ట్‌.. ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల

APPSC JOB Notification: ఏపీలోని నిరుద్యోగుల‌కు అలెర్ట్‌.. ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల

by Anji
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. ఫారెస్ట్ స‌ర్వీస్ విభాగంలో అసిస్టెంట్ క‌న్జ‌ర్వేట‌ర్ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 09 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ రేప‌టి నుంచి అంటే ఏప్రిల్ 20 నుండి ప్రారంభ‌మ‌వుతుంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి మే 10ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆ తేదీల్లో అప్లై చేసుకోవాల‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసారు.


అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుండి డిగ్రీ విద్యార్హ‌త క‌లిగి ఉండాలి. అగ్రిక‌ల్చ‌ర్, బోట‌నీ, కెమిస్ట్రీ, కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌, కంప్యూట‌ర్ సైన్స్, ఇంజ‌నీరింగ్‌, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌, ఫారెస్ట్రీ, భూగ‌ర్భ‌శాస్త్రం, హార్టిక‌ల్చ‌ర్‌, మాథ్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్, వెట‌ర్న‌రీ సైన్స్‌, జువాల‌జి స‌బ్జెక్టుల్లో డిగ్రీ చేసి ఉండాలి. ఆ అభ్య‌ర్థులు నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు క‌లిగి ఉండాలి. పూర్తి వివ‌రాల‌ను నోటిఫికేష‌న్‌లో చూడ‌వ‌చ్చు.

Advertisement

Advertisement

వ‌య‌స్సు అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుండి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్లు, ఎక్స్ స‌ర్వీస్ మెన్‌, ఎన్‌సీసీ అభ్య‌ర్థుల‌కు మూడేళ్లు వ‌యో పరిమితిలో స‌డ‌లింపు ఇచ్చారు. అప్లికేష‌న్ ప్రాసెసిండ్ ఫీజుగా అభ్య‌ర్థులు రూ.250 చెల్లించాలి. ప‌రీక్ష ఫీజు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్, ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు ఎగ్జామ్ ఫీజులో మిన‌హాయింపు ఇచ్చారు. తెల్ల‌ రేష‌న్ కార్డు క‌లిగిన అభ్య‌ర్థుల‌కు సైతం ఫీజులో మిన‌హాయింపు ఇచ్చారు. అభ్య‌ర్థులు నెట్ బ్యాంకింగ్‌, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఫీజులు చెల్లించ‌వచ్చు.

అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అభ్య‌ర్థులు మొద‌ట ఇంగ్లీషు, తెలుగు యాబై మార్కుల చొప్పున నిర్వ‌హించే ఎగ్జామ్‌లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ అండ్ మెంట‌ల్ ఎబిలిటీ 150 మార్కులు, మాథ్స్‌-150, జ‌న‌ర‌ల్ ఫారెస్ట్రీ-150 మార్కులు, జ‌న‌ర‌ల్ ఫారెస్ట్రీ-2కు సంబంధించి 150 మార్కులు,మొత్తం 600 మార్కుల‌కు నిర్వ‌హించే ప‌రీక్ష‌లో అభ్య‌ర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

  1.  Gruhalakshmi ఏప్రిల్ 21 (ఈరోజు) ఎపిసోడ్ : అభి, అంకిత‌కు తుల‌సి షాక్.. అంకితను ఇంటికి తీసుకెళ్లిన గాయ‌త్రి..!
  2. నాగార్జున అలా అన‌డంతో కృష్ణ ఫ్యాన్స్ కొట్ట‌డానికి వ‌చ్చార‌ట‌..అస‌లేం జ‌రిగిదంటే..!
  3. స్వ‌యంకృషి సినిమా ఎఫెక్ట్…. చెప్పుల‌షాపుల పేరు మార్చిన య‌జ‌మానులు..!
Visitors Are Also Reading