Home » మెగాస్టార్ గాడ్ ఫాద‌ర్ విడుద‌ల తేదీ ఖ‌రారు.. మూడు సినిమాలు పోటీ..!

మెగాస్టార్ గాడ్ ఫాద‌ర్ విడుద‌ల తేదీ ఖ‌రారు.. మూడు సినిమాలు పోటీ..!

by Anji
Ad

మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన లూసీఫ‌ర్ ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్‌ఫాద‌ర్ టైటిల్ గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్త‌యింది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. గాడ్ ఫాద‌ర్ సినిమాలో హిందీ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.


ఇదిలా ఉండ‌గా.. ఈసినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల విష‌యంలో చిత్ర‌బృందం అప్పుడే ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాను ఆగ‌స్టు 11న విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం డిసైడ్ అయింది. ఆగ‌స్టు 15న సోమ‌వారం కావ‌డంతో వ‌రుస‌గా సెల‌వులు క‌లిసి వ‌స్తాయ‌ని మూవీ మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇదే తేదీన అఖిల్ ఏజెంట్‌, స‌మంత య‌శోద‌, అమీర్‌ఖాన్ లాల్సింగ్ చ‌ద్దా కూడా రానున్నాయ‌ట‌. గాడ్‌ఫాద‌ర్‌కు థ‌మ‌న్ సంగీత‌మందిస్తుండ‌గా.. సినిమాటోగ్రాఫ‌ర్ నీర‌వ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. కొణిదెల సురేఖ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌.బీ. చౌద‌రి, ఎన్‌.వీ.ప్ర‌సాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

Advertisement

Also Read :  రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ గురించి త‌మ్మారెడ్డి ఏమ‌న్నారో తెలుసా..?

ఈ సినిమాను తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళం, హిందీల‌లో విడుద‌ల చేయాల‌ని సిద్ధంగా ఉంది చిత్ర యూనిట్‌. లూసీఫ‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ ఆ చిత్రంలో కీ రోల్ పోషించారు. ఇప్పుడు అదే పాత్ర‌ను తెలుగులో స‌ల్మాన్‌ఖాన్ పోషిస్తున్నారు. తొలుత ఈ పాత్ర కోసం రామ్‌చ‌ర‌న్‌, ఆ త‌రువాత అల్లుఅర్జున్ పేర్ల‌ను ప‌రిశీలించారు. కానీ చివ‌ర‌కు స‌ల్మాన్‌ఖాన్ ఈ రోల్ చేస్తున్నారు. స‌ల్మాన్ కోసం ఓ పాట‌ను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచారు. అందుకు త‌గ్గ‌ట్టే ఈ సినిమాలో మార్పులు చేర్పులు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్ పాత్ర‌లో మాధ‌వ‌న్ న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇందులో చిరంజీవి చెల్ల‌లు పాత్ర‌లో న‌య‌న‌తార న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో స‌త్య‌దేవ్ మ‌రొక కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

Also Read :  రాహుల్ గాంధీతో జ‌గ్గారెడ్డి భేటీ.. ఇక స‌మ‌స్య‌ల్లేవు..!

Visitors Are Also Reading