Home » రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ గురించి త‌మ్మారెడ్డి ఏమ‌న్నారో తెలుసా..?

రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ గురించి త‌మ్మారెడ్డి ఏమ‌న్నారో తెలుసా..?

by Anji
Ad

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియా లేవ‌ల్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాను తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా కొద్దిరోజుల్లోనే 1000 కోట్ల‌ను గ్రాస్ క‌లెక్ష‌న్ల మార్కును అధిగ‌మించ‌నున్న‌ది. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న రికార్డులు సృష్టించిన ఆర్ఆర్ఆర్ ఇత‌ర రాష్ట్రాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవ‌కాశాలున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల‌కు ఒంటిపూట బ‌డులు కావ‌డంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓ విధంగా ప్ల‌స్ అవుతుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత‌ల్లో ఒక‌రైన త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఆర్ఆర్ఆర్ గురించి ఏమి మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం.


ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్ రేట్లు త‌క్కువ‌గా ఇదే స్థాయిలో క‌లెక్ష‌న్లు వ‌చ్చేవ‌ని.. కొంచెం ఆల‌స్యంగా ఈ రేంజ్‌లో క‌లెక్ష‌న్లు వ‌చ్చేవ‌ని పేర్కొన్నారు. రాజ‌మౌళి గ్రేట్ డైరెక్ట‌ర్ అని.. ఆయ‌న ఇద్ద‌రు చరిత్ర కారుల‌ను ఒకే సినిమాలో చూపించ‌కుండా ఉండాల్సింద‌ని.. ఒక‌రి చరిత్ర‌తో సినిమా తెర‌కెక్కించి ఉంటే బాగుండేది అని త‌మ్మారెడ్డి కామెంట్ చేసారు. ఆర్ఆర్ఆర్ సినిమా వ‌ల్ల చరిత్ర తెలియ‌ని కొంత మంది రామ‌రాజు, భీమ్ ఆడుకున్నార‌ని భావించే ఛాన్స్ ఉంటుంద‌ని చెప్పారు.

Advertisement

Advertisement

మ‌రికొంద‌రికీ వీరి చ‌రిత్ర తెలుసు అని.. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌దు అని త‌మ్మారెడ్డి తెలిపారు. ముఖ్యంగా రాజ‌మౌళి ఒక్క ప్రేమ్ వృథా కాకుండా సినిమా తీస్తాన‌ని చెబుతార‌ని ఆయ‌న సినిమాల‌కు ఎక్కువ స‌మ‌యం ఎందుకు ప‌డుతోంద‌ని ప్ర‌శ్నించారు త‌మ్మారెడ్డి. పాన్ ఇండియా మార్కెట్ వ‌చ్చింద‌ని హీరోలు రెమ్యున‌రేష‌న్లు పెంచుతున్నార‌ని.. ఆ ప్ర‌భావం సినిమా టికెట్ రేట్ల‌పై ప‌డుతోంద‌ని టికెట్ రేట్ల గురించి కూడా ఆలోచించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ప్ర‌స్తుతం త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ చేసిన ఈ కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ కామెంట్ల‌పై రాజ‌మౌళి స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

Also Read :  రాడిస‌న్ ప‌బ్ ఘ‌ట‌న‌పై రామ్ గోపాల్ వ‌ర్మ ఏమ‌న్నారంటే..?

Visitors Are Also Reading