Home » అందరూ వదిలేసినా సిల్క్ స్మిత కు తోడుగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి అన్నపూర్ణ..అసలు ఆమె ఎవరు..?

అందరూ వదిలేసినా సిల్క్ స్మిత కు తోడుగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి అన్నపూర్ణ..అసలు ఆమె ఎవరు..?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీ లోకి చాలామంది వస్తుంటారు పోతుంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే ఈ లోకంలో ఉన్నా లేకున్నా ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో సిల్క్ స్మిత కూడా ఒకరు. మేకప్ ఆర్టిస్టుగా కెరీర్ ను మొదలుపెట్టిన సిల్క్ స్మిత ఐటమ్ డాన్సర్ గా నటిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. స్టార్ హీరోలు తన డేట్ ల కోసం ఎదురుచూసే స్థాయికి సిల్క్ ఎదిగింది. అయితే సిల్క్ జీవితం ఎప్పుడూ పూల పాన్పు కాదు.

Advertisement

పుట్టినప్పటి నుండి కన్నుమూసే వరకు ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఆమెను వెంటాడాయి. చిన్న వయసులోనే కుటుంబ సభ్యులు పెళ్లి చేయడం ….ఆ తర్వాత భర్త వేధింపులతో అతడిని విడిచి పెట్టడం దాంతో కుటుంబ సభ్యులు కూడా దూరం పెట్టడం…. ఇలా సిల్క్ జీవితంలో మొదటి నుండి కష్టాలే. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత నటిగా గుర్తింపు సంపాదించుకున్న సిల్క్ ఇక్కడ కూడా నమ్మిన వారి చేతనే మోసపోయింది.

Advertisement

అయితే సిల్క్ జీవితంలో ఆది నుండి అంతం వరకు తోడుగా ఉంది మాత్రం ఒకే ఒక్క వ్యక్తి ఆమె పేరే అన్నపూర్ణ. సిల్క్ స్మితను అన్నపూర్ణ చిన్న వయసులోనే దత్తత తీసుకుంది. అన్నపూర్ణ మరెవరో కాదు సిల్క్ కు స్వయానా పెద్దమ్మ అవుతుంది. సిల్క్ స్మితకు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అన్నపూర్ణ దత్తత తీసుకున్నారు. సినిమాలపై సిల్క్ కోరికను గమనించిన అన్నపూర్ణ ఆమెను నటిని చేయాలని గుంటూరు నుండి చెన్నైకి తీసుకువెళ్లారు. చెన్నై వెళ్లిన తర్వాత నటి ఛాయాదేవికి సిల్క్ అసిస్టెంట్ గా పని మనిషికిగా కూడా బ్రతికింది. ఇక సిల్క్ పెద్దమ్మ అన్నపూర్ణ ఇళ్లలో పాచి పనులు చేసి కష్టపడేవారు. అయితే ఓసారి తాటికొండలో సినిమా షూటింగ్ జరుగుతుండగా అవకాశం కోసం అన్నపూర్ణ సిల్క్స్ ను తీసుకొని వెళ్ళింది.

ఆ తర్వాత మెల్లిమెల్లిగా సిల్క్ కు సినిమా ఆఫర్లు వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే స్టార్ గా ఎదిగిపోయింది. కానీ స్టార్ గా ఎదిగినా సిల్క్ స్మితను ఇండస్ట్రీలోని కొంతమంది ప్రేమ పేరుతో వాడుకునే వాళ్ళు. అవకాశం ఇస్తామని మోసం చేసిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. అంతేకాకుండా ఒక స్టార్ హీరో చేతిలో సిల్క్ దారుణంగా మోసపోయిందని చెబుతుంటారు. సిల్క్ రాసిన చివరి ఉత్తరం చదివితే కూడా ఆమె ఎంతలా బాధపడిందో అర్థమవుతుంది. ఇక సిల్క్ చనిపోదామని అనుకున్నప్పుడు తనకు మొదటి నుండి తోడుగా ఉన్న అన్నపూర్ణమ్మను ఊరికి వెళ్ళమని పంపింది. ఆమె వెళ్లిన తర్వాత బలవన్మరణానికి పాల్పడింది.

Visitors Are Also Reading