సాధారణంగా ఒక చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు ఫోటోగ్రఫీ, హీరో, హీరోయిన్లు ఎంతమంది ఉన్నప్పటికీ ఆ సినిమాకు సరైన ఎడిటర్ లేకపోతే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించదు. ఒక సినిమా హిట్ కావాలన్నా.. ఫ్లాప్ కావాలన్నా సినిమా ఎడిటర్ పాత్ర కీలకం అనే చెప్పవచ్చు. అలాంటి ఎడిటర్‌లలో గౌతమ్‌రాజు ఒకరు. ఇవాళ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. ఆయనకు దర్శక ధీరుడు రాజమౌళికి మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
దర్శకుడు రాజమౌళి విషయానికొస్తే.. ఒక సినిమా ఎలా తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే కాన్సెప్ట్ లో మంచి పట్టు సంపాదించారు. అందుకే ఆయన తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుంటుంది. చాలా వరకు రాజమౌళి సినిమా అంటే ఫిదా అవుతుంటారు. రాజమౌళి అనగానే ఒక సినిమాను అమరశిల్పి చెక్కుతాడనే పేరు ఉంది. అందుకే ఎన్టీఆర్-రాజమౌళికి జక్కన్న అని ముద్దుగా పిలుస్తుంటారు. రాజమౌళి జక్కన్నగా ఒక సినిమాను శిల్పమాదిరిగా తెరకెక్కించడంలో దాని వెనుక ఉన్నది దివంగత ఎడిటర్ గౌతమ్ రాజు అనే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళిక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వద్ద శాంతి నివాసం సీరియల్‌కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టకముందే కొన్నేళ్లు ఎడిటర్ గౌతమ్ రాజు వద్ద పని చేశారు. గౌతమ్ రాజు వద్ద ఎడిటర్ ఒక సినిమా ఎక్కడ ఎలా కట్ చేయాలనే విషయాలను నేర్చుకున్నాడు.
Advertisement
ఒక రకంగా చెప్పాలంటే రాజమౌళికి కె.రాఘవేంద్రరావు కంటే ముందే గౌతమ్ రాజు గురువు అని చెప్పాలి. అలా ఫేమస్ ఎడిటర్ గౌతమ్ రాజు దగ్గర ఎడిటింగ్ నేర్చుకుని.. ఆ తరువాత రాజమౌళి ఎంతగానో ఉపయోగపడింది. దర్శకునిగా సినిమా తెరకెక్కించడంతో పాటు ఆ సినిమాను ఏవిధంగా ఎడిటింగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే చేయడంలని మెలకువులు ఎడిటర్ గౌతం రాజు దగ్గరే ఒడిసిపట్టాడు. ఇలా రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తరువాత బాహుబలి వరకు ఆయన ప్రతీ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పని చేశారు. బాహుబలి2 సినిమాకు కోటగిరితో పాటు తమ్మిరాజు ఎడిటర్ గా పని చేశారు.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు మాత్రం శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. తన గురువు గారు అయిన ఎడిటర్ గౌతమ్ రాజుతో తన ఏ సినిమాను కూడా ఎడిటింగ్ చేయించుకోలేదు. తన గురువుతో పని చేయించుకోవాల్సి వస్తే ఆజామాయిషీ చేయాల్సి వస్తుందనే కారణంతో ఆయనతో పని చేదు అని పలు సందర్బాల్లో రాజమౌళి ప్రస్తావించారు. 1982లో మెగాస్టార్ చిరంజీవి సినిమా నాలుగు స్థంబాలాట చిత్రంతో ఎడిటర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఎడిటర్ గౌతమ్ రాజు. దాదాపు 850 పైగా సినిమాలకు ఎడిటర్‌గా పని చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలకు కూడా ఆయన ఎడిటర్‌గా పని చేసి తన మార్క్‌ను చూపించేవారు. తెలుగులో సూపర్ హిట్ చిత్రాలైన బాలకృష్ణ లెజెండ్, చెన్నకేశవరెడ్డి, చిరంజీవి ఖైదీ నెంబర్ 150, పవన్ కల్యాణ్ గబ్బర్‌సింగ్, గోపాల గోపాల, అల్లుఅర్జున్ రేసుగుర్రం, బద్రినాథ్, రవితేజ కిక్, బలుపు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read :
టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు మృతి