Home » టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు మృతి

టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు మృతి

by Anji
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు మృతి చెందారు. ఆయ‌న మ‌ర‌ణంతో తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. దాదాపు 900ల‌కు పైగా చిత్రాల‌కు ఆయ‌న ఎడిట‌ర్‌గా ప‌ని చేశారు. తెలుగులో ప్ర‌స్తుతం అగ్ర హీరోలుగా ఉన్న వారంద‌రితో ఏదో ఒక చిత్రానికి ప‌ని చేసారు. గౌత‌మ్ రాజు మృతితో ప‌లువురు ప్ర‌ముఖులు షాక్‌కు గుర‌య్యారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున గౌత‌మ్ రాజు తుదిశ్వాస విడిచిన‌ట్టు స‌మాచారం.


గౌత‌మ్‌రాజు ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌ల కార‌ణంగా వారం రోజుల క్రితం న‌గ‌రంలోని ఓ ప్ర‌ముఖ ఆసుప‌త్రిలో ఆయ‌న‌ను చేర్పించారు. వైద్యులు తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఈయ‌న ప‌రిస్థితి విష‌మించి ఇవాళ తెల్ల‌వారుజామున తిరిగి రాని లోకాల‌కు వెళ్లారు. గౌతమ్‌రాజుకు ఇద్ద‌రు కూతుర్లున్నారు. పెద్ద‌మ్మాయి అత్త‌గారి ఊరు కాకినాడ‌. అల్లుడు, అమ్మాయి హైద‌రాబాద్ నిజాంపేట‌లో నివాస‌ముంటున్నారు. చిన్నమ్మాయి, అల్లుడు అమెరికాలో ఉంటున్నారు. తండ్రికి ఆరోగ్యం బాలేద‌ని తెలిసిన వెంట‌నే చిన్న‌మ్మాయి భార‌త్ కు వ‌చ్చారు. మోతిన‌గ‌ర్‌లో నివాసం ఉండే గౌతమ్ రాజు నివాసం వ‌ద్ద ఆయ‌న పార్థివ దేహం ఉంది. ప‌లువురు ప్ర‌ముఖులు అక్క‌డికి వెళ్లి నివాళుల‌ర్పిస్తున్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మ‌హాప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చ‌ట్టానికి క‌ళ్లులేవు అనే సినిమాతో గౌత‌మ్ రాజు ఎడిట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ త‌రువాత చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ త‌దిత‌ర హీరోల సినిమాల‌కు ఎడిట‌ర్‌గా ప‌ని చేశారు. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డం,హిందీ సినిమాలు కూడా చేశారు. ప్ర‌ధానంగా బాల‌కృష్ణ లెజెండ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, గోపాల గోపాల‌, ఎన్టీఆర్ అదుర్స్, అల్లు అర్జున్ రేసుగుర్రం, ర‌వితేజ కిక్, నాగ‌చైత‌న్య రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్ సినిమాల‌కు ఆయ‌న ఎడిట‌ర్ గా ప‌ని చేశారు. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు న‌టించిన స‌న్నాఫ్ ఇండియా ఎడిట‌ర్‌గా గౌత‌మ్‌రాజు చివ‌రి చిత్రం అనే చెప్పాలి. ఇక ప్ర‌స్తుతం శాస‌న స‌భ అనే చిత్రానికి ఆయ‌న ప‌ని చేస్తున్న‌ప్ప‌టికీ ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు.

Also Read : 

పేరు మార్చుకున్న చిరంజీవి…! కారణం అదేనా…?

విహారి ఆ క్యాచ్ ప‌ట్టి ఉంటే మ్యాచ్ మ‌రోలా ఉండేది.. నెటిజ‌న్ల కామెంట్స్ వైర‌ల్‌..!

Visitors Are Also Reading