Home » శ్రీలీలకు, సాయి పల్లవికి మధ్య ఈ రిలేషన్ ఏమిటో తెలుసా?

శ్రీలీలకు, సాయి పల్లవికి మధ్య ఈ రిలేషన్ ఏమిటో తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ల స్థాయికి చేరింది శ్రీలీలా. ఈమె ధమాకా సినిమా తర్వాత ఎదురులేని హీరోయిన్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాలు ఒప్పుకుంది. అయితే తాజాగా ఈ అమ్మడు అంతర్జాతీయ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈమె చెన్నై స్టోరీ అని ఇంగ్లీష్ సినిమాలో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది.

srileela sai pallavi

Advertisement

Advertisement

ఇదంతా ఒకెత్తయితే.. శ్రీలీలకు టాలీవుడ్ లేడీ సూపర్స్టార్ గా పేరు తెచ్చుకుంటున్న సాయి పల్లవికి చిన్న లింక్ ఉందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం అని చాలా మంది నటులు చెప్తూనే ఉంటారు. అయితే.. డాక్టర్ అయ్యి కూడా యాక్టర్ అయ్యిన నటుల లిస్ట్ లో సాయి పల్లవి ముందు ఉంటుంది. సాయి పల్లవి డాక్టరేట్ చేసిందన్న సంగతి తెలిసిందే. తాజాగా అదే కోవలోకి శ్రీ లీల కూడా వచ్చింది.

ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటున్న శ్రీ లీల ప్రస్తుతం డాక్టర్ చదువుతోంది. ఆమె తల్లి కూడా ఒక డాక్టర్. తల్లి బాటలోనే డాక్టర్ చదువు ఎంచుకున్న శ్రీలీల ఈ ఏడాది డాక్టరేట్ పట్టా పుచ్చుకోనుంది. ఇంకా ఇదే కోవలో, డాక్టర్ చదివి కూడా యాక్టర్ అయిన నటుల లిస్ట్ లో అల్లు రామలింగయ్య, రాజశేఖర్, నటాషా (బాలకృష్ణ జైసింహ హీరోయిన్), భరత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అజ్మల్ అమీర్ (రంగం).. ఇంకా చాలా మందే ఉన్నారు.

Visitors Are Also Reading