అలనాటి స్టార్ నటులలో ఎన్టీఆర్ ఎంత ఆదరాభిమానాలు సంపాదించుకున్నారో మనందరికీ తెలుసు.. ఆ విధంగానే కమెడియన్ గా రేలంగి కూడా అంతే క్రేజ్ సంపాదించుకున్నారు.. ఆయన పూర్తి పేరు రేలంగి వెంకట్రామయ్య. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈయన పేరే. ముద్దుగా రేలంగి అని పిలిచేవారు. ఈయనకి ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఉండేది. ఇక సినిమాల విషయానికి వస్తే కమెడియన్ రేలంగి, ఎన్టీఆర్ కంటే సీనియర్ నటులు. ఈయన కంటే 5-6 సంవత్సరాల ముందే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో చిన్నాచితకా వేషాలు వేసేవారు. నేరుగా ఆయన నటుడిగా మారలేదు.
Advertisement
ALSO READ;Jr NTR: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే వారి పని ఖతమే అంటున్న ప్రముఖ జ్యోతిష్కుడు..!!
ఆయన నటుడిగా మారడానికి చాలా చిత్రాలు జరిగాయి. మద్రాసులో పితాంబరం అనే వ్యక్తి సినిమాలకు జూనియర్ ఆర్టిస్టులను పరిచయం చేసేవారు. ఆయన అసిస్టెంట్ గా రేలంగి పనిచేసేవారు. అయితే ఓ రోజు చిన్న సన్నివేశానికి కావలసిన మనిషి రాకపోవడంతో ఆ స్థానంలో రేలంగిని పెట్టారట. ఇక అప్పటి నుంచి మొదలు వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందారు. కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించడానికి అవకాశాలు వచ్చేవి. ఆ తర్వాత ఆయన పర్ఫామెన్స్, టైమింగ్,మాట తీరు బాగుండడంతో అవకాశాలు పెరిగిపోయాయి. ఓవైపు నటుడిగా చేస్తూనే మరోవైపు ఆర్టిస్టులను పరిచయం చేయడం మాత్రం ఆపలేదు. అప్పట్లో ఎన్టీఆర్ సినిమాల్లో నటించడానికి వచ్చిన టైం లో ఎన్టీఆర్ కు రేలంగి సహాయం చేశారట.
Advertisement
సినిమా లొకేషన్ లో కూడా ఇద్దరు కలిసి ఉండేవారు. వీరిద్దరి స్నేహం అలాగే కొనసాగింది. ఒకరితో ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం వంటి ఆర్థిక కార్యకలాపాలు కూడా చేసుకునేవారు. కానీ చిక్కంతా వచ్చింది ఇక్కడే. రేలంగి గారు చదువుకోలేదు. చేతినిండా డబ్బు ఉన్నా వాటిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక భయపడేవాడు. దీంతో ఏదైనా సలహా కోసం రేలంగి ఎక్కువగా అన్న గారిని సంప్రదించేవారట. అలా ఎన్టీఆర్ సలహాతో వెస్ట్ గోదావరిలో ఒక థియేటర్ కూడా కట్టించారట. దాని నిర్వహణ బాధ్యతలను తన కొడుకు సత్యనారాయణకు అప్పగించారట రేలంగి. ఈ విధంగా ఎన్టీఆర్ సూచనలు పాటించిన రేలంగి తన కొడుకుని హీరోని చేయమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదట. ఆయన ఇచ్చిన సలహా పట్టించుకోలేదని ఒకటి రెండు సార్లు ఎన్టీఆర్ కూడా ఫీలయ్యారని సమాచారం. ఒకవేళ తన కొడుకు హీరో అయితే ఇంకా ఆయన పరిస్థితి బాగుండేదేమో..
ALSO READ;ఒకప్పటి తార సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం..! జీవితంలో అంతటి నరకాన్ని చూసిందో ఆమె మాటలలోనే..!