ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఛాలెంజర్ కప్-2023లో రికార్డు విజయం నమోదు అయింది. టోర్నీలో భాగంగా మయన్మార్ తో జరిగిన మ్యాచ్ లో సౌదీ అరేబియా ఏకంగా 327 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించడం విశేషం. ఏసీసీ మెన్స్ ఛాలెంజర్ కప్ చరిత్రలో ఇది భారీ విజయంగా రికార్డు నమోదు అయింది.
Also Read : కేటీఆర్ ముందరే.. సుడిగాలి సుధీర్ పరువు తీసేసిన ఆటో రాంప్రసాద్..!
Advertisement
ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌదీ అరేబియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసింది. ఛేదనలో మయన్మార్ 25.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. సౌదీ ఇన్నింగ్స్ లో అబ్దుల్ మనన్ అలీ (102) సెంచరీతో చెలరేగాడు. మహమ్మద్ హిషమ్ షేక్ (59), అబ్దుల్ వహీద్ (61), జైన్ ఉల్ అబ్దిన్ (66 నాటౌట్) హాప్ సెంచరీలతో రాణించారు. మయన్మార్ బౌలర్లలో ఖిన్ అయే, ఔంగ్ ఖో ఖో తలో 2 వికెట్లు పడగొట్టగా.. పైంగ్ దాను, సాయ్ హ్టెట్ వై, కో కో లీన్ థు ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
Advertisement
Saudi Arabia dominates Myanmar with a massive 327-run victory in the #ACCChallengercup, qualifying for the semifinals in style! Congratulations to the team on their remarkable performance! pic.twitter.com/5SyTaDgotu
— AsianCricketCouncil (@ACCMedia1) March 1, 2023
మయన్మార్ ఇన్నింగ్స్ లో కేవలం ఇద్దరు మాత్రమే రెండెంకెల స్కోర్ చేయగా.. వీరిలో యే నైంగ్ తున్ (29) టాప్ స్కోరర్ గా నిలిచాడు. సౌదీ బౌలర్లలో అబ్దుల్ వహీద్ 4 వికెట్లు పడగొట్టగా.. జైన్ ఉల్ అబ్దిన్ 2, అబ్దుల్ వహీద్, జుహైర్ మహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో సౌదీ అరేబియా సింపుల్ గా సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది.
Also Read : ఫ్యాన్స్ కు షాక్…రిషబ్ పంత్ మళ్లీ క్రికెట్ ఆడటం కష్టమేనట ?