Home » ఎన్నో మరపురాని పాత్రలని పోషించిన NTR అల్లూరి సీతారామ రాజు పాత్రని ఎందుకు వెయ్యలేదంటే ?

ఎన్నో మరపురాని పాత్రలని పోషించిన NTR అల్లూరి సీతారామ రాజు పాత్రని ఎందుకు వెయ్యలేదంటే ?

by AJAY
Ad

అల్లూరి సీతారామ‌రాజు అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా న‌టించిన సినిమానే. అయితే నిజానికి అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టించాల‌ని ఎన్టీఆర్ క‌ల‌లు క‌న్నారు. ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ అది అని చెప్ప‌వ‌చ్చు. కానీ అది ఎన్టీఆర్ కు ఒక క‌ల‌గానే మిగిలిపోయింది. 1954లో ఎస్ఎమ్ శ్రీరాములు ఎన్టీఆర్ హీరోగా అగ్గిరాముడు అనే సినిమాను తీశారు. ఈ సినిమాలో అల్లూరిసీతారామ‌రాజు పాత్ర‌ను న‌ట‌కంగా చిత్రీక‌రించారు. ఆ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించ‌గా ఆ పాత్ర ఆయ‌న‌కు ఎంత‌గానో న‌చ్చేసింది.

Advertisement

అప్ప‌టి నుండి అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టించాల‌ని పూర్తిసినిమా చేయాల‌ని క‌ల‌లు క‌న్నారు. అంతే కాకుండా ప్ర‌య‌త్నాలు కూడా మొద‌లు పెట్టారు. అల్లూరి సీతారామ‌రాజు క‌థ‌ను నాట‌కంగా మ‌ల‌చిన ప‌డవ‌ల రామారావును పిలిపించి స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా చేయించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ కు అల్లూరిసీతారామార్ గెట‌ప్ వేసి స్టిల్స్ కూడా తీశారు. 1957లో చెన్నైలో అల్లూరి సీతారామరాజు తొలి పాట చిత్రీక‌ర‌ణ చేశారు. ప‌న్నెండు మంది గాయ‌కులు ఈ పాట‌ను పాడ‌టం విశేషం.

Advertisement

అయితే అప్ప‌టికి సినిమా క్లైమాక్స్ మాత్రం రాసుకోలేదు. సీతారామ‌రాజు మ‌న్యంలో చేప‌ట్టిన ఉద్య‌మానికి విరామం ప్ర‌క‌టిస్తారు. అక్క‌డితో క్లైమాక్స్ ను ముగించాల‌ని అనుకున్నారు. కానీ ఆ క్లైమాక్స్ ఎన్టీఆర్ కు న‌చ్చ‌లేదు. ఆ త‌ర‌వాత మరో స్టార్ రైట‌ర్ మ‌హార‌దితో క్లైమాక్స్ రాయించారు….ఆ క్లైమాక్స్ కూడా ఎన్టీఆర్ కు న‌చ్చ‌లేదు. దాంతో మ‌హార‌ది ఈ క‌థ‌ను కృష్ణ‌కు వినిపించ‌గా ఆయ‌న‌కు తెగ‌న‌చ్చేసింది.

Alluri seetharamaraju

ఆ త‌ర‌వాత మ‌రికొంద‌రు ర‌చ‌యిత‌ల‌తో క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశారు. ప్ర‌ముఖ న‌టీన‌టుల‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మయంలో కొంద‌రు ఎన్టీఆర్ అల్లూరి పాత్ర‌లో న‌టించాల‌ని అనుకుంటున్నార‌ని సినిమాను ఆపాల‌ను కృష్ణ‌ను కోరార‌ట‌. కానీ కృష్ణ సినిమాను పూర్తి చేసి విడుద‌ల చేశారు. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ కృష్ణ‌ను మెచ్చుకుని అల్లూరిసీతారామ‌రాజు సినిమా చేయాల‌నే కోరిక‌ను వ‌దిలేసుకున్నారు.

Also Read: రియల్ లైఫ్ లో పెద్దవారికి రిల్ లైఫ్ లో పెద్దగా నటించిన ప్రకాష్ రాజ్…

Visitors Are Also Reading