Home » రియల్ లైఫ్ లో పెద్దవారికి రిల్ లైఫ్ లో పెద్దగా నటించిన ప్రకాష్ రాజ్…

రియల్ లైఫ్ లో పెద్దవారికి రిల్ లైఫ్ లో పెద్దగా నటించిన ప్రకాష్ రాజ్…

by Azhar
Ad

తెలుగు సినిమా అభిమానులకు ప్రకాష్ రాజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తండ్రి, మామ, అన్నయ, విలన్ ఇలా ఏ తరహా పాత్రలోనైనా ఆయన జీవించేస్తారు. చేసే పాత్రకు తన నటనతో జీవం పోస్తారు. అయితే ఇలా ఎన్నో రకాలుగా వైవిధ్యంగా నటించిన ఆయన.. తన కంటే వయస్సులో పెద్దవారైనా నటులకు కూడా తండ్రి పాత్రలు చేసారు. అలా ప్రకాష్ రాజ్ నటించిన కొన్ని సినిమాలు చూద్దాం.

Advertisement

తెలుగు నటుడు.. డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారి వయస్సు 61 సంవత్సరాలు. కానీ ప్రకాష్ రాజ్ వయస్సు 57 సంవత్సరాలు. తనకంటే నాలుగు ఏళ్ళు పెద్దవాడైన సాయి కుమార్ కి అనంతపురం సినిమాలో తండ్రిగా నటించారు ప్రకాష్ రాజ్. జగపతి బాబు, సౌందర్య కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ ఆ విజయంలో ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్ర పోషించాడు.

Advertisement

సాయి కుమార్ మాదిరిగానే తనకంటే నాలుగు ఏళ్ళు పెద్దవాడైన విక్టరీ వెంకటేష్ కూడా తండ్రిగా ప్రకాష్ రాజ్… సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో రేలంగి మామయ్యగా ఆయన చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా అన్ని రకాల పాత్రలో అభిమానులను అలరిస్తున్న ప్రకాష్ రాజ్ రాజకీయ జీవితం అంత సాఫీగా సాగడం లేదు. అయిన కూడా వెన్నకి తగ్గకుండా ఆయన తన స్టైల్ లో ముందుకు సాగుతున్నాడు.

Visitors Are Also Reading