Home » స్టార్ హీరో..హిట్ ప్రొడ్యూసర్ ఉన్నా బ్రహ్మోత్సవం ఫ్లాప్ కు కారణం అదేనా…?

స్టార్ హీరో..హిట్ ప్రొడ్యూసర్ ఉన్నా బ్రహ్మోత్సవం ఫ్లాప్ కు కారణం అదేనా…?

by AJAY
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలలో హీరోగా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించిన మహేష్ తన కెరీర్లో కొన్ని ఫ్లాప్ మూవీలలో కూడా నటించాడు. అలా మహేష్ కెరియర్ లో భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన సినిమాల్లో బ్రహ్మోత్సవం మూవీ ఒకటి.

Advertisement

Advertisement

ఈ సినిమాలో మహేష్ సరసన కాజల్ అగర్వాల్… సమంత… ప్రణీత హీరోయిన్లుగా నటించగా … శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. పివిపి బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీలో రావు రమేష్ , సత్య రాజ్ , జయసుధ ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ 2016వ సంవత్సరం మే 21 తేదీన థియేటర్లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన ఫ్లాప్ గా నిలవడానికి ప్రధాన కారణం ఈ సినిమా హీరో మరియు ఈ మూవీ దర్శకుడు … నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన పూర్తి కథ సిద్ధం కాకుండానే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లారట. ఆ తర్వాత పూర్తి కథ లేకపోవడంతో సినిమా షూటింగ్ దశలోనే అనేక సమస్యలు ఎదురయ్యాయట. చివరగా ఈ సినిమా పూర్తి కథ లేని కారణంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచినట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading