Home » అంద‌రికీ న‌చ్చిన ఖ‌లేజా ఎందుకు ఫ్లాప్ అయ్యింది…5 కార‌ణాలు ఇవేనా..!

అంద‌రికీ న‌చ్చిన ఖ‌లేజా ఎందుకు ఫ్లాప్ అయ్యింది…5 కార‌ణాలు ఇవేనా..!

by AJAY
Ad

కొన్ని సినిమాలు చూసిన వెంట‌నే న‌చ్చుతాయి. మ‌రికొన్ని సినిమాలు అప్పుడు అర్థం కాక‌పోయినా సినిమాలో ఏదో కొత్త‌దనం ఉంద‌ని అనిపిస్తుంది. ఆ త‌ర‌వాత సినిమా సూప‌ర్ గా ఉంది క‌దా అప్పుడెందుకు న‌చ్చ‌లేద‌ని అనిపిస్తుంది. అలాంటి సినిమాల లిస్ట్ లో మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్ లో వచ్చిన ఖ‌లేజా సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా 2010లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Advertisement

త్రివిక్ర‌మ్ మ‌హేష్ బాబు సినిమా కావ‌డంతో ఈ చిత్రం పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఆ అప్పుడు సినిమా న‌చ్చ‌లేదు కానీ ఆ త‌ర‌వాత సినిమాలోని మ్యాజిక్ ను ప్రేక్ష‌కులు గుర్తించారు. ఇంత మంచి సినిమా ఎలా ఫ్లాప్ అయ్యింద‌నే దైలమాలో ప‌డ్డారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వ‌డానికి ఐదు కార‌ణాలు ఉన్నాయని విశ్లేష‌కులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…

Advertisement

ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు ఆదుకున్న‌వాడే దేవుడని చెప్పే ప్ర‌య‌త్నం త్రివిక్ర‌మ్ చేశాడు. కానీ ఆ పాయింట్ స‌రిగ్గా ప్ర‌జెంట్ చేయ‌లేదు. ఈ క్ర‌మంలో ప్ర‌తిసారి దేవుడు అని చెప్ప‌డంతో మ‌నిషి దేవుడెలా అవుతాడు అనే క‌న్ఫ్యూజ‌న్ లో ప్రేక్ష‌కులు ప‌డిపోయారు.

ఏ సినిమా అయినా ఒక జోన‌ర్ కు సంబంధించిన‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. కానీ ఖలేజా సినిమా కామెడీ, హార్ర‌ర్, యాక్ష‌న్ ఇలా ఒక ప్ర‌త్యేక జోన‌ర్ కు చెందిన‌ద‌ని చెప్ప‌లేం.


ఖలేజా సినిమాలో స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్న ప్ర‌జ‌ల‌ను చూపిస్తారు. కానీ అది ఎక్క‌డో ఉత్త‌రాది ప్రాంతం కావ‌డంతో ప్రేక్ష‌కులు దానికి క‌నెక్ట్ అవ్వ‌లేక‌పోయారు.

సినిమాలోని సీరియ‌స్ సీన్ల‌ను కూడా కామెడీగా చూపించేస‌రికి ప్రేక్ష‌కుడికి విసుగు పుట్టింది. అంతే కాకుండా కొన్నిసార్లు కామెడీ కూడా బోర్ కొట్టేలా ఉంటుంది.

త్రివిక్ర‌మ్ మ‌హేశ్ బాబు సినిమా అన‌గానే అత‌డు రేంజ్ లో ఊహించుకున్నారు. కానీ ఆ రేంజ్ లో సినిమా లేక‌పోవ‌డంతో నిరాశ‌చెందారు.

Visitors Are Also Reading