Home » బాలయ్య కంటే చిరంజీవి మార్కెట్ ఎక్కువగా ఉండడానికి అసలు కారణాలివే!

బాలయ్య కంటే చిరంజీవి మార్కెట్ ఎక్కువగా ఉండడానికి అసలు కారణాలివే!

by Bunty
Ad

ఈసారి సంక్రాంతి మామూలుగా జరగలేదు. పందెం కోళ్ల పోటీలతో పాటు మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య కూడా పోటీ నెలకొంది. ఈ సంక్రాంతికి బాలయ్య హీరోగా చేసిన వీర సింహారెడ్డి మరియు చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాల్తేరు వీరయ్య కామెడీ యాక్షన్ జోనర్ లో రాగా, వీరసింహారెడ్డి మాత్రం మాస్ ఫ్యాన్స్ ను కదిలించింది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. అలాగే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మంచి టాక్ నే సొంతం చేసుకున్నాయి. అయితే ఇందులో బాలకృష్ణ కంటే చిరంజీవి మార్కెట్ ఎక్కువ.

Advertisement

బాలకృష్ణ కంటే చిరంజీవి మార్కెట్ ఎక్కువగా ఉండడానికి కారణాలేంటి అనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథాంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టగా, బాలయ్య ఎక్కువగా మాస్ సినిమాలపై దృష్టి పెట్టడం ఆయనకు ఒక విధంగా మైనస్ అయింది. బి,సి సెంటర్లలో బాలయ్య సినిమాలు ఆడిన స్థాయిలో ఏ సెంటర్లలో బాలయ్య సినిమా ఆడడం లేదు. మరోవైపు కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సినిమాలు తక్కువగా ఉండటం, వరుసగా విజయాలను సొంతం చేసుకునే విషయంలో బాలయ్య ఫెయిల్ కావడం కూడా ఆయన సినీ కెరీర్ పై ప్రభావం చూపింది.

Advertisement

సినిమాలను సరైన టైములో రిలీజ్ చేయకపోవడం, రిలీజ్ డేట్ల ఎంపికలో పొరపాట్లు కూడా బాలయ్యకు మైనస్ అవుతున్నాయి. ఇతర భాషలపై బాలయ్య దృష్టి పెట్టకపోవడం ఆయన సినిమాలపై ఎఫెక్ట్ చూపుతోంది. ఈ పొరపాట్లను బాలయ్య సరిదిద్దుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ కావడానికి ఎంతో సమయం పట్టదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాలానికి అనుగుణంగా బాలయ్య ఇప్పటికే కొన్ని విషయాలలో మారగా, మరికొన్ని విషయాలలో మారాల్సి ఉంది.

READ ALSO : తారకరత్న తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల ..! డాక్టర్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం…..!

Visitors Are Also Reading