Jr Ntr: ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఒక్కొక్కరు ఒక్కో పేరు కలిగి ఉన్నారు. ప్రభాస్ ని రెబల్ స్టార్ అని అంటాము. మహేష్ బాబుని సూపర్ స్టార్ అంటాము. ఐకాన్ స్టార్ అని అల్లు అర్జున్ అంటాము. ఇలా ఒకరికి ఒక పేరు ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ని టాలీవుడ్ యంగ్ టైగర్ అని పిలుస్తూ ఉంటాము. అయితే అసలు యంగ్ టైగర్ అని ఎందుకు ఆయన్ని పిలుస్తామో దాని వెనుక కారణం ఏంటి..? జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పాలంటే ముందు యంగ్ టైగర్ అని యాడ్ చేసి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తూ ఉంటాము. సాధారణంగా హీరోలలో ఉన్న యూనిక్ టాలెంట్ ని బట్టి అలా ప్రత్యేకంగా ఏదో ఒక బిరుదుని ఇవ్వడం జరుగుతుంది.
Advertisement
తారక్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రియలు అందరికీ కూడా తెలుసు తారక్ అన్న నటనతో అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత పేరు తెచ్చుకున్నారు. తారక్ ని టైగర్ అని పిలవడం వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. యమదొంగ నుండి యంగ్ టైగర్ అని పిలవడం మొదలుపెట్టారు. రాజమౌళి ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు. కానీ సినిమాటోగ్రాఫర్ సిందేల్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ చెప్పారు. టైగర్ లాంటి జంతువులతో పాటుగా ఎన్టీఆర్ జంప్ చేసే సీన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సీన్లు గురించి చెప్తూ కుమార్ తారక్ గురించి పలు విషయాలను చెప్పారు .
Advertisement
Also read:
Also read:
ఒక సన్నివేశాన్ని షూట్ చేస్తున్నప్పుడు తారక్ వేగాన్ని అందుకోవడం తమకు చాలా కష్టమైందని అయితే తర్వాత అంత ఫాస్ట్ గా ఎలా పరిగెత్తారు అని తారక్ ని అడిగితే తను నేషనల్ లెవెల్ అథ్లెట్ అనే విషయాన్ని చెప్పారని ఆయన అన్నారు తారక్ ని అందరూ అందుకే టైగర్ అని పిలుచుకుంటారేమో అని అన్నారు. నిజానికి చాలామంది అభిమానులకి ఈ విషయం తెలీదు. నందమూరి నట వారసుడు, అయిన యాక్టింగ్ స్కిల్స్ ని చూసి టైగర్ అని పిలుచుకుంటారని అంతా అనుకుంటారు కానీ నిజానికి ఎన్టీఆర్ అథ్లెట్ కావడం వల్లే ఆయనకి ఈ పేరు వచ్చింది అనే విషయాన్ని తాజాగా కుమార్ చెప్పారు ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్ 2 వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ వస్తోంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!