Home » ధోనీ బయోపిక్ రావడానికి ఓ పిల్లోడు కారణమా..?

ధోనీ బయోపిక్ రావడానికి ఓ పిల్లోడు కారణమా..?

by Azhar
Ad

క్రికెట్ లో కెప్టెన్ కూల్ గా పేరు అనేది సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనికి కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ధోని క్రికెట్ లో ఉండగానే అతని బయోపిక్ అనేది వచ్చింది. ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ అనే పేరుతో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించగా… నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. 2016 లో వచ్చిన ఈ సినిమా అనేది ఎంతో మంచి ఫ్యాన్స్ కు స్పిర్తిని ఇవచ్చింది.

Advertisement

అయితే ధోని బయోపిక్ రావడానికి ఓ పిల్లడు కారణం అని దర్శకుడు నీరజ్ పాండే చెప్పాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. నేను రెండేళ్లుగా ధోనిని తన బయోపిక్ కు ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడే ఓసారి ధోని ఎయిర్ పోర్ట్ లో ఉన్న సమయంలో తానావద్దకు ఓ పిల్లడు వచ్చాడు. అప్పుడు నేను ధోని పక్కనే ఉన్నాను. అయితే ఆ పిల్లాడు ధోనితో నేను ఉన్నత చదువులకు సిద్ధం అవుతున్నాను. నాలో స్ఫూర్తి రావడనికి ఏమైనా మాటలు చెప్పండి అని అడిగాడు. ఆ తర్వాత అతని అన్ని ప్రశ్నలకు ధోని సమాధానం ఇచ్చాడు.

Advertisement

అయితే ఆ పిల్లాడు వెళ్లిన తర్వాత.. అతని కోసం ఇంత సమయం ఇవ్వడం అవసరమా అని నేను ప్రశ్నించగా.. నా వల్ల అతనిలో స్ఫూర్తి వస్తుంది అంటే అంతా కంటే ఏం కావాలి అన్నాడు. అప్పుడు నీ సమాధానాల కంటే.. నీ జీవితం ఇంకా చాలా మంది యువకులకు స్ఫూర్తిని ఇస్తుంది అని చెప్పను. దానితో రెండేళ్లుగా ఒప్పుకొని ధోని వెంటనే బయోపిక్ కోసం ఒప్పుకున్నాడు అని నీరజ్ పాండే అన్నారు.

ఇవి కూడా చదవండి :

ఆస్ట్రేలియాలో మళ్ళీ ఆ సెంటిమెంట్ పని చేసేనా..?

మరో కోహ్లీ రికార్డును సమం చేసిన పాకిస్థాన్ కెప్టెన్..!

Visitors Are Also Reading