Home » మరో కోహ్లీ రికార్డును సమం చేసిన పాకిస్థాన్ కెప్టెన్..!

మరో కోహ్లీ రికార్డును సమం చేసిన పాకిస్థాన్ కెప్టెన్..!

by Azhar
Ad
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం యొక్క ఆటను ప్రత్యేకంగా గుర్తింపు అనేది ఉంది. ముఖ్యంగా భారత స్టార్ ఆటగాడు అయిన విరాట్ కోహ్లీతో బాబర్ ను గతంలో చాలాసార్లు పోల్చేవారు. కానీ ఇప్పుడు కోహ్లీ యొక్క రికార్డులనే బాబర్ బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా కోహ్లీ యొక్క మరో రికార్డును బాబర్ సమం చేసాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో 7 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆరో మ్యాచ్ నేడు ఆతున్నాడు బాబర్ ఆజాం.
ఇక ఈ మ్యాచ్ లో బాబర్ 87 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 3000 పరుగుల మార్క్ ను బాబర్ ఆజాం క్రాస్ చేసాడు. బాబర్ ఆజాం కంటే ముందు నలుగురు ఈ ఘనత ఆందుకున్నారు. అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మార్టిన్ గప్టిల్ మరియు పాల్ స్టిర్లింగ్ ఉన్నారు.
అయితే ఈ మార్క్ ను ఇప్పటివరకు అతి తక్కువా ఇన్నింగ్స్ లో అందుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ 81 ఇన్నింగ్స్ తో ఉన్నాడు. కానీ ఇప్పుడు బాబర్ ఆజాం కూడా 81 ఇన్నింగ్స్ లోనే ఈ మార్క్ ను అందుకొని కోహ్లీతో సమానంగా నిలిచాడు. అయితే 3000 పరుగులు 100 ఇన్నింగ్స్ లోపే చేసిన ఆటగాళ్లు కేవలం విరాట్ కోహ్లీ, బాబర్ ఆజాం మాత్రం కావడం విశేషం.

Advertisement

Visitors Are Also Reading