Home » Rohit Sharma: పాండ్యా కాదు నిజమైన కెప్టెన్ రోహిత్…!

Rohit Sharma: పాండ్యా కాదు నిజమైన కెప్టెన్ రోహిత్…!

by Sravya
Ad

ఐపీఎల్ 2024 సీజన్ లో అనుకోనివి చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన రోహిత్, ఈ సీజన్ స్టార్ట్ అవ్వకముందే వార్తలు లో నిలుస్తున్నారు. ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించిన హిట్ మాన్ ని కాదని గుజరాత్ నుండి క్యాష్ ఆన్ ట్రేడ్ విధానం ద్వారా ఎంఐ టీం లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ని కెప్టెన్ గా నియమించారు. ఇక్కడి నుండి ఎంఐ టీమ్ పాండ్యా వర్సెస్ రోహిత్ గా మారింది. జట్టు రెండుగా విడిపోయింది అని వార్తలు సైతం వస్తున్నాయి. పేరుకి పాండ్యా కెప్టెన్ గా ఉన్నాడు తప్ప టీం ని నడిపించేది రోహిత్ అని అర్ధం అవుతోంది.

Advertisement

తాజాగా ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో ఈ వీడియో చూస్తే పాండ్య కదా నిజమైన కెప్టెన్ రోహిత్ అని మీరే చెప్తారు. రోహిత్ కెప్టెన్సీ నుండి దూరమైన తర్వాత తన పనితో తాను చేసుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్ లలో ఈ మాట నిజమే అవ్వచ్చు. కానీ గ్రౌండ్ లోకి దిగిన తర్వాత రోహిత్ లో ఉన్న నాయకుడు మాత్రం అస్సలు ఊరుకోడు. మ్యాచ్ ఓడిపోతామేమో అని అనిపిస్తే చాలు తనలో ఉన్న నాయకుడు వచ్చేస్తాడు. ప్రస్తుతం రోహిత్ చేస్తున్న పని ఇదే. పేరుకే హార్థిక్ పాండ్యా కెప్టెన్ గా ఉంటున్నాడు కానీ అసలైన సారథి రోహిత్ అని అందరూ అంటున్నారు.

నిన్న మ్యాచ్ లో టైం అవుట్ సమయంలో రోహిత్ శర్మలో ఉన్న కెప్టెన్ బయటికి వచ్చాడు శ్రేయస్ గోపాల్ తో టైం అవుట్ సమయంలో మాట్లాడాడు రోహిత్ తర్వాత ఓవర్ లోనే ప్లేయర్ మాక్స్వెల్ ని ఎలిబీ గా ఔట్ చేశాడు దీంతో ఇది కథ కెప్టెన్సీ అంటే అని హిట్ మ్యాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రోహిత్ కి ఏ కెప్టెన్ సాటి రాడని అందరూ అంటున్నారు. మరికొందరు పాండ్యా కాదు ముంబైకి అసలైన కెప్టెన్ రోహిత్ అని అంటున్నారు. ప్లేయర్లను ఎలా కాపాడుకోవాలి పరిస్థితులకి తగ్గట్టు ఎలా బౌల్ చేయాలి అనేది రోహిత్ కి మాత్రమే తెలుసు అని రోహిత్ కి ఎవరు సాటి రారని మరోసారి నిరూపించుకున్నారని నెటిజన్స్ అంటున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

స్పోర్ట్స్ న్యూస్  కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading