Home » చిరు సినిమాలో రవితేజ పాత్రను కట్ చేస్తున్నారా..?

చిరు సినిమాలో రవితేజ పాత్రను కట్ చేస్తున్నారా..?

by Azhar
Ad

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా చేస్తున్నారు. అయితే ఈ మధ్యే గాడ్ ఫాధర్ సినిమాను విడుదల చేసిన చిరు.. ఇప్పుడు తన 154వ సినిమా పైనే ఫోకస్ పెట్టాడు. ఎందుకంటే గాడ్ ఫాధర్ సినిమాకు హిట్ టాక్ అనేది వేసిన కలెక్షన్స్ అనేవి రాలేదు. అందువల్ల ఈ సినిమాతో వసూళ్లు రాబట్టాలని ఆయన అనుకుంటున్నారు. ఇక వాల్తేరు వీరయ్యగా వస్తున్న సినిమా నుండి ఈ మధ్యే ఓ అప్డేట్ అనేది వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

ఇదిలా ఉంటె.. రి ఎంట్రీ తర్వాత తన సినిమాలో ఎవరో ఒక్క హీరో ఉండేలా చూసుకుంటున్న చిరు.. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజను పెట్టుకున్నారు. కానీ ఇందులో వీరి మధ్య ఉండే సంబంధం ఏంటి అనేది అయితే అర్ధం కావడం లేదు. కానీ ఇందులో రవితేజ చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి.

Advertisement

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవిబుతేజ పాత్రను కట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాంట్ చేయడం అంటే పూర్తిగా తొలగించడం లేదు. పెద్దగా ఉన్న రవితేజ పాత్రను చిన్నగా చేస్తున్నారు అని తెలుస్తుంది. అందుకు కారణం ఏంటో మాత్రం తెలియడం లేదు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వనున్న ఈ సినిమా పైన మెగాస్టార్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కూడా చాలానే ఆశలు అనేవి పెట్టుకున్నారు అనేది అందరికి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

రాహుల్ ఐపీఎల్ లోనే ఆడుతాడు.. ఎందుకంటే..?

చెన్నైని విడుతు కొత్త జట్టులోకి జడేజా ఎంట్రీ..?

Visitors Are Also Reading