గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అఖండ విజయాన్ని సాధించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి రికార్డు స్థాయిలో 150కి పైగా సీట్లు గెలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుచుకుంది 99 సీట్లు మాత్రమే. అప్పుడు కాంగ్రెస్ 77 సీట్లు గెలిచింది. ఈసారి ఎన్నికల్లో ఆప్ కూడా తమ అదృష్టం పరీక్షించుకుంది. ప్రస్తుతం ఆప్ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఐదు సీట్లు వచ్చాయి.
ఇవి కూడా చదవండి : క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్, విశాఖలో టీమిండియా మ్యాచ్‌లు
Advertisement
ఇదంతా పక్కకు పెడితే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ జామ్ నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, రివాబా ఘన విజయం సాధించారు. బిజెపి టికెట్ పై పోటీ చేసిన రివాబా, సమీప అభ్యర్థిపై 61, 065 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రివాబా జడేజా మీడియాతో మాట్లాడారు. తనకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన బిజెపితో పాటు, తన కోసం ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తన విజయం మాత్రమే కాదు. ప్రజలందరి విజయమంటూ రివాబా సంతోషం వ్యక్తం చేశారు.
Advertisement
ఇక ఆటు ట్విటర్ వేదికగా తన భార్య విజయాన్ని ప్రస్తావించడం జడేజా, ‘హలో ఎమ్మెల్యే’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. గుజరాతిలో ట్రీట్ చేసిన జడేజా, ఈ విజయానికి రివాబా పూర్తి అర్హురాలని పేర్కొన్నాడు. జామ్ నగర్ నియోజకవర్గం లో పనులన్నీ వేగంగా జరిగిపోతాయని హామీ ఇచ్చిన జడేజా, తన సతీమణిని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసాడు. మరోవైపు, భార్యను గెలిపించడానికి టీం ఇండియాకు దూరమయ్యాడని ఆరోపణలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. గాయం సాకుతో, టీమ్ ఇండియాకు ఆడని జడేజా, భార్య తరపున ప్రచారం ఎలా చేశాడని ప్రశ్నిస్తున్నారు. శాశ్వతంగా టీమ్ ఇండియా నుంచి తప్పించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
read also : తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. TSPSC నుంచి మరో భారీ జాబ్ నోటిఫికేషన్..