Ad
టీమ్ ఇండియాలో ప్రస్తుతం ఉన్న స్టార్ ఆల్ రౌండర్ జడేజా. తన ప్రతిభ ఏంటో గతంలో చాలా మ్యాచ్ లవ్ బాల్ తో అలాగే బ్యాట్ తో కూడా చూపించాడు జడేజా. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ కోసం భారత జట్టుతో పాటు యూఏఈకి వెళ్లిన జడేజా అక్కడ మొదట పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించి.. జట్టు విజయంలో కీలక పాత్ర అనేది పోషించాడు.
అయితే ఆ తర్వాత హాంగ్ కాంగ్ తో మ్యాచ్ ఆడిన జడేజా సరిగ్గా సూపర్ 4 ముందు ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. దాంతో ఆసియా కప్ కు అతను పూర్తిగా దూరం అయ్యాడు. జడేజా వెళ్లిపోవడంతో జట్టుకు పెద్ద నష్టమే అని చెప్పాలి. అయితే జడేజా కాలి వెలికి బలంగా గాయం కావడంతో ఈరోజు సర్జరీ అనేది చేసారు. అయితే ఆ సర్జరీ సక్సెస్ అయ్యినట్లు జడేజా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
నా సర్జరీ సక్సెస్ అయ్యింది.. నా కోసం ప్రార్ధనలు చేసిన అందరికి ధన్యవాధాలు. వీలైనంత తొందరగా నేను కోలుకొని మళ్ళీ గ్రౌండ్ లోకి వస్తాను అని జడేజా పోస్ట్ చేసాడు. దాంతో జడేజా వచ్చే నెల చివర్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ కు అందుబాటులోకి వస్తాడు అనే ఆశలు ఫ్యాన్స్ కు ఏర్పడ్డాయి. దానికోసం ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో జడేజా కోలుకొని వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి.
ఇవి కూడా చదవండి :
ఇప్పటికైనా సంజూకి అవకాశాలు ఇస్తారా…?
పడిపోయిన బాబర్, సూర్య కుమార్..!
Advertisement