Home » ఇప్పటికైనా సంజూకి అవకాశాలు ఇస్తారా…?

ఇప్పటికైనా సంజూకి అవకాశాలు ఇస్తారా…?

by Azhar
Ad

ఆసియా కప్ లో భారత జట్టు యొక్క ప్రదర్శన అనేది అందరిని నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తప్పకుండా టైటిల్ సాధిస్తుంది అనుకున్న భారత జట్టు కనీసం ఫైనల్స్ కు కూడా చేరుకోలేకపోయింది. ఈ క్రమంలోనే బీసీసీఐపై చాలా విమర్శలు అనేవి వస్తున్నాయి. జట్టు సెలక్షన్స్ లో ఉన్న లోపాలు సరి చేసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఇప్పుడైనా సంజూ శాంసన్ కు అవకాశాలు అనేవి ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement

అయితే భారత జట్టులో ఈ మధ్యే కొన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడి బాగా పరుగులు చేసిన సంజూ శాంసన్ కు ఆసియా కప్ లో అవకాశం రాలేదు. ఆ స్థానంలో రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకున్నారు. కానీ పంత్ మాత్రం ఈ టోర్నీలో అందరిని నిరాశపరిచిన విషయం తెలిసందే. పాకిస్థాన్ తో మ్యాచ్ లో కష్ట సమయంలో చెత్త షాట్ అనేది ఆడి ఔట్ అయిన పంత్.. నిన్న శ్రీలంకపైన కూడా రాణించలేదు.

Advertisement

మిడిల్ ఆర్డర్ లో పరుగులు చేయాల్సిన పంత్.. తొందరగా ఔట్ కావడంతో భారత్ ఖాతాలో ఎక్కువ పరుగులు అనేది చేరలేదు. అందుకే ఇప్పుడైనా పంత్ ను జట్టు నుండి తప్పించాలని.. ఆ స్థానంలో సంజూ శాంసన్ ను తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సంజూ శాంసన్ ఓపెనర్ గా కూడా పనికి వస్తాడు అని.. అతనికి ఆ అనుభవం ఉంది అని పేర్కొంటున్నారు. ఇక సంజూ శాంసన్ కీపింగ్ స్కిల్స్ గురించి అందరికి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

పడిపోయిన బాబర్, సూర్య కుమార్..!

రోహిత్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే ఇండియా ఖేల్ ఖతం..!

Visitors Are Also Reading