Home » శ్రీను వైట్లను మరో ఛాన్స్ ఇస్తున్న ఆ స్టార్ హీరో..!

శ్రీను వైట్లను మరో ఛాన్స్ ఇస్తున్న ఆ స్టార్ హీరో..!

by Azhar
Ad

టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అనేది తెచ్చుకొని ఇప్పుడు ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ లలో శ్రీను వైట్ల ఒక్కడు. అయితే ఈయన ఢీ అనే సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చాడు. అయితే ఆ తర్వాత రవితేజతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన శ్రీను వైట్ల లైఫ్ అనేది మహేష్ బాబుతో తీసిన దూకుడు సినిమాతో మారిపోయింది.

Advertisement

కానీ ఆ తర్వాత మళ్ళీ మహేష్ తోనే తీసిన ఆగడు సినిమా ఆయనను కిందకు పడేసింది. అయిన కూడా మళ్ళీ కొంతమంది హీరోలతో ఆయన తీసిన సినిమా ప్లాప్ అయ్యాయి. అందులో రవితేజతో తీసిన అమర్ అక్బర్ ఆంటోని అనే సినిమా కూడా ఉంది. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల ఢీఢీ అనే సినిమా మంచి విష్ణుతోనే చేస్తున్నాడు. ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని ఆయన చూస్తున్నాడు,

Advertisement

అయితే ఈ సినిమా విషయం పక్కన పెడితే.. దీని తర్వాత శ్రీను వైట్ల ఎవరితో చేయబోతున్నాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కానీ దీనికి సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అదేంటంటే శ్రీను వైట్లకు ఇప్పుడు మరో అవకాశం అనేది ఇవ్వడానికి రవితేజ సిద్ధం అయ్యినట్లు తెలుస్తుంది. ఈ మధ్యే శ్రీను వైట్ల ఓ కథను రవితేజకు వినిపించగా.. మాస్ మహారాజ కూడా ఈ సినిమాను గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

టీమిండియాకు చుక్కలు చూపించిన ఫ్యాన్స్..!

ఇంగ్లాండ్ లో ఇండియా వికెట్ కీపర్ బ్యాగ్ దొంగతనం..!

Visitors Are Also Reading