ప్రస్తుతం ఇండియన్ సినిమా అభిమానులు అందరూ ఓకే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అదే కేజిఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ హీరో గా కనిపించిన కేజిఎఫ్ చాప్టర్ 1 అద్భుతమైన విజయం అందుకోవడంతో చాప్టర్ 2 పై భారీ అంచనాలు పెరిగాయి.
Advertisement
ఇక తాజాగా ఈనెల 14న విడుదలైన కేజిఎఫ్ చాప్టర్ 2 అభిమానుల అంచనాలకు మించిన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రాఖీ బాయ్ అలాగే మరికొంతమంది ముఖ్యపాత్ర లకు ఇచ్చిన ఎలివేషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అటువంటి పాత్రలలో రవీనాటాండన్ పాత్ర కూడా ఒకటి.
బాలీవుడ్ నటి రవీనాటాండన్ ప్రధానమంత్రిగా కనిపించిన రమీక సేన్ పాత్ర అన్ని వర్గాలను అట్రాక్ట్ చేస్తుంది. హీరోని ఢీకొట్టే ప్రధానమంత్రి పాత్రలో రవీనాటాండన్ నటించిన తీరు పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఈ ప్రధానమంత్రి మన తెలుగులో లెజెండ్ బాలయ్య బాబు తో అప్పట్లోనే ఓ సినిమాలో నటించింది అనే విషయం చాలా మందికి తెలియదు. మంచి విజయాలతో ఉన్న బాలకృష్ణ నిప్పురవ్వ అనే సినిమా చేస్తున్నాడు. అయితే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో… రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో బంగారు బుల్లోడు అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు.
Advertisement
ఇందులో ఇద్దరు హీరోయిన్లు కావాల్సి ఉండగా… మొదటి హీరోగా రమ్యకృష్ణమీ ఎంపిక చేసిన చిత్ర బృందం రెండో హీరోయిన్ గా దివ్యభారతిని తీసుకోవాలని చూశారు. కానీ ఆమె అప్పటికే చాలా బిజీగా ఉండటంతో దర్శకుడు రవి టాండన్ కూతురు గా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి విజయాలతో దూసుకెళ్తున్న రవీనా టాండన్ ను ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా ఎంపిక చేసింది చిత్రబృందం. అయితే ఇందులో బాలకృష్ణకు రవీనాటాండన్ కు మధ్యలో సాగే ”స్వాతిలో ముత్యమంత” అనే పాట అభిమానులను తెగ అలరించింది. ఈ పాటతో పాటు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయం తరువాత రవీనాటాండన్ తెలుగులో మరికొన్ని సినిమాల్లో కూడా నటించింది.
ఇవి కూడా చదవండి :
సాహా చెప్పిందే నిజం.. మజుందార్ పై నిషేధం…!