Ravanasura Review in Telugu: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రావణాసుర. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీం వర్క్స్ బ్యానర్ పై అభిషేక్ నామా రూపొందించారు. ఈ చిత్రం కోసం రవితేజ తొలిసారిగా క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించారు. అందుకోసం రవితేజ కొంతమంది లాయర్స్ ను కలిసి వారి బాడీ లాంగ్వేజ్ ను నేర్చుకొని మరీ నటించారు. సుశాంత్ ఇందులో కీలకపాత్ర నటించారు. అయితే ఇవాళ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.
READ ALSO : AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…
Advertisement
కథ మరియు వివరణ
రావణాసుర కథ విషయంలోకి వెళితే.. సినిమా ప్రారంభం కాగానే… వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. కోర్టులో న్యాయం జరగకపోతే… రవితేజ… బయట బాధితులకు న్యాయం చేస్తాడు. ఇలా న్యాయం చేయడానికి రవితేజ ఎలాంటి త్యాగం చేస్తాడు… ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తాడు. లాయర్ గా ఉంటూనే… తన వద్దకు వచ్చిన సమస్యలను… పరిష్కరిస్తూ ఉంటాడు హీరో రవితేజ. ఇక ఈ సినిమాలో రవితేజ సీన్స్ హైలెట్ అయ్యాయి. రవితేజ ఎంట్రీ సీన్స్ మరియు యాక్షన్ సీన్స్ చాలా అదిరిపోయాయి. అటు మధ్య మధ్యలో రొమాంటిక్ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి.
Advertisement
Read Also : అబ్బాయిలు ఈ లక్షణాలు కలిగి ఉంటే… అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడతారు
ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం ఒక ఎత్తు అయితే… రవితేజ కోసం ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటించిన మరో ఎత్తు. అను ఇమ్మానుయేల్, మెగా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, పూజిత తో పాటు దక్ష తమ అందాలు ఆరబోసి…సినిమాకు హైలెట్ గా నిలిచారు. ఇక ఈ మూవీలో అక్కినేని హీరో సుశాంత్…కూడా సినిమాకు ప్లస్ అయ్యాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ హాఫ్ అందరినీ ఆకట్టుకుంటుంది. న్యాయం కోసం రవితేజ అసలు…ఈ హ**లు ఎందుకు చేస్తున్నాడు… వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడు అని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
రవితేజ యాక్టింగ్
హీరోయిన్స్ గ్లామర్
కథ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
సినిమా ఫస్టాఫ్
సాగదీత
రేటింగ్
2.75/5
READ ALSO : విడాకుల తర్వాత..సమంత కోసం చీకటి గదిలో నాగచైతన్య ఏడ్చాడా…?