Home » ఒక్క రాత్రి కాదు.. ఎన్నో రాత్రులు అలా గడిపానంటూ సంచలన విషయాలు బయటపెట్టిన రష్మిక..!!

ఒక్క రాత్రి కాదు.. ఎన్నో రాత్రులు అలా గడిపానంటూ సంచలన విషయాలు బయటపెట్టిన రష్మిక..!!

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్ లలో టాప్ లో ఉన్నారు రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ అమ్మడు నేషనల్ క్రష్ గా పేరు పొందారు. ఒక తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా తన అంద చందాలతో యువతకు చెమటలు పట్టిస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో “నా సామి అంటూ” ఓ రేంజ్ లో ఊపేసింది. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకొని ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. సినిమా సినిమాకి తన రెమ్యూనరేషన్ ను పెంచుకుంటూ దూసుకెళ్తోంది.

Advertisement

ప్రస్తుతం చాలామంది దర్శక నిర్మాతలు ఈమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అంటే రష్మిక మందన్న ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రష్మిక ని చూసి ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు కుళ్ళుకుంటున్నారట. ఆమె అదృష్టం బాగుందని పెద్ద పెద్ద సినిమాలలో ఆఫర్లు వస్తున్నాయంటూ హైలెట్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే రష్మిక మందన్న తన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను బయటపెట్టేసింది. ఆమె హీరోయిన్ గా ఎదగడానికి ఎలాంటి కష్టం పడిందో వింటే మీరు కూడా షాక్ అవ్వడం ఖాయం. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇలా మాట్లాడింది..

Advertisement

నేను ఇండస్ట్రీలో రాత్రికి రాత్రే స్టార్ అవ్వలేదు.. అదృష్టాన్ని నా వెనక తిప్పుకోలేదు.. హీరోయిన్ కావడానికి ఏడు సంవత్సరాలు కష్టపడ్డాను. ఎన్నో వదులుకున్నాను. ఎన్నో బాధలను దిగమింగుకొని, కష్టాలను దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చానని అన్నారు. అందరూ అనుకున్నట్లుగా ఒక్క నైట్ లో మాత్రం నాకు ఈ పేరు అయితే రాలేదు. ఒక మంచి హీరోయిన్ గా ఎదగాలంటే ఒక్క నైట్ సరిపోదు. టాలెంట్ తో పాటు సహనం, పట్టుదల, ఓర్పు అనే విషయాలు మన మనసులో ఉంటే అంతా మంచే జరుగుతుందని రష్మిక కామెంట్స్ చేసింది. దీంతో రష్మిక మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

ALSO READ;

Visitors Are Also Reading