Home » ఆ కథతో బోయపాటి రామ్ కు హిట్ ఇస్తాడా…?

ఆ కథతో బోయపాటి రామ్ కు హిట్ ఇస్తాడా…?

by Azhar
Ad

టాలీవుడ్ ఎనర్జటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ తాజాగా ది వారియర్ సినిమాతో ఫ్యాన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో రామ్ ఈ సినిమా చేసాడు. ఇక ఈ సినిమాతోనే మొదటిసారి రామ్ కోలీవుడ్ లోకి వెళ్ళాడు. కానీ ఆ సినిమా అనేది అనుకున్న విధంగా ఆడలేదు. దాంతో రామ్ ఖాతాలోకి ప్లాప్ అనేది వచ్చింది. అయితే అంతకముందు ఇస్మార్ట్ శంకర్ అలాగే రెడ్ సినిమాలతో హిట్స్ అందుకున్నాడు.

Advertisement

కానీ ఇప్పుడు ప్లాప్ అనేది రావడంతో… మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. అయితే ది వారియర్ అనే సినిమా విడుదల కాకముందే రామ్ తన తర్వాతి సినిమా టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందువల్ల ఇప్పుడు ది వారియర్ అనేది ప్లాప్ కావడంతో.. వీరి కాంబినేషన్ పై చాలా ఆసక్తి అనేది పెరింది. ఆ సమయంలోనే వీరి సినిమా కథకు సంబంధించిన లైన్ అనేది లీక్ అయ్యినట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే రామ్ తో బోయపాటి తీసే ఈ సినిమా అనేది మొత్తం రాబరీ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల అనేది కానున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాలో రామ్ గత రెడ్ సినిమాలో లాగా డబల్ యాక్షన్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో ఒక్కరు మంచి వ్యక్తిగా కనిపిస్తే మరొకరు బ్యాడ్ పర్సన్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ రకమైన కథతో బోయపాటి రామ్ కి హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

లాన్ బౌల్స్ లో టీం ఇండియా గోల్డ్.. ఈ గేమ్ ఎలా ఆడుతారో తెలుసా..?

ఒక్కే జెర్సీని వేసుకున్న భారత ఆటగాళ్లు..!

Visitors Are Also Reading