Home » కన్నడిగులకు రష్మిక క్షమాపణలు

కన్నడిగులకు రష్మిక క్షమాపణలు

by Bunty
Ad

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కన్నడ అమ్మాయి. ఆమె ముందుగా శాండల్ వుడ్ లోనే తన కెరీర్ ని ప్రారంభించింది. కానీ ఆమెకు కన్నడ చిత్ర పరిశ్రమ కంటే తెలుగు చిత్ర పరిశ్రమ స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది. అయితే రష్మిక మందన్న తన మొదటి పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప ది రైజ్”లో కన్నడలో తన వాయిస్‌ని డబ్ చేయకపోవడం గమనార్హం. సినిమా విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే మిగలడంతో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక పలు నగరాల్లో సినిమాను ప్రమోట్ చేస్తోంది.

Advertisement

Advertisement

బుధవారం ఆమె బెంగళూరులో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కన్నడలో తన వాయిస్‌ని ఎందుకు డబ్బింగ్‌ చేయలేదని ఓ విలేఖరి అడగ్గా.. తన డైలాగ్ చెప్పాలనుకున్నానని, అయితే పూర్తి చేయడానికి సమయం సరిపోలేదని అల్లు అర్జున్ వివరించాడు. ‘‘ఇటీవలి వరకు సినిమా షూటింగ్‌లో ఉన్నాం. పని వేగవంతం చేయడానికి డబ్బింగ్ ఆర్టిస్టులను తీసుకోవడమే ఉత్తమమైన మార్గమని దర్శకుడు సుకుమార్, మేము భావించాము” అని ఆయన అన్నారు. రష్మిక తన మాతృభాషలో తన వాయిస్‌ని డబ్బింగ్ చేయనందుకు క్షమాపణలు చెప్పింది. “పుష్ప” రెండవ భాగం కోసం చేస్తానని హామీ ఇచ్చింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కి లవర్ గా శ్రీవల్లి పాత్రను రష్మిక పోషించింది. ఆమె తెలుగులో మాత్రం సొంతంగా డబ్బింగ్ చెప్పింది.

Visitors Are Also Reading