Home » పుష్ప2 లో రష్మిక లేనట్టేనా..?

పుష్ప2 లో రష్మిక లేనట్టేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందాన కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ పుష్ప. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప2 కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ తరుణంలోని హీరోయిన్ రష్మిక మందన ఈ చిత్రం నుండి అవుట్ అయిందంటూ కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంతో, అబద్ధం ఎంతో చూద్దాం.. పుష్ప సినిమాలో రష్మిక మందాన తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది.

Advertisement

also read:మూడో భార్య‌కు ప‌వ‌న్ విడాకులు…నెట్టింట వైర‌ల్ అవుతున్న న్యూస్..?

ఇక పుష్ప2 లో కూడా ఈ కన్నడ బ్యూటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా పుష్ప2 నిర్మాతలు హీరోయిన్ కోసం సాయి పల్లవితో చర్చలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ద్వారా రష్మిక నేషనల్ క్రష్ గా మారింది. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో బిజీగా ఉందట. ఇప్పటికే ఆమె నటించిన నాలుగు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయట. ఈ తరుణంలో రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ ఊహాగానాలకు తెరలేపింది. తను చేసిన పోస్టును చూస్తే రష్మిక పుష్ప2 నటిస్తుందా లేదా అనేది క్లారిటీ ఇచ్చేసింది.

Advertisement

ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు “వారీసు” వచ్చింది. అంతేకాకుండా మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉంది. షూటింగ్ దశలో పుష్ప2 తో పాటు మరిన్ని ఆశ్చర్యకరమైన మూవీస్ ఉన్నాయంటూ రష్మిక ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అంటే ఏడాది నాలుగు సినిమాలతో రష్మిక అలరించబోతుందని అర్థం చేసుకోవచ్చు. రష్మిక పెట్టిన ఈ పోస్ట్ ద్వారా ఆమె పుష్ప2 లో కూడా నటిస్తుందని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఇక పుష్ప2లో రష్మిక మందన్నతో పాటు సాయి పల్లవి కూడా నటిస్తారని చిత్ర బృందం స్పష్టం చేసింది.

also read:

Visitors Are Also Reading