Ugadi rasi phalalu 2022-2023:తెలుగు కొత్త సంవత్సరం అనగానే లేత మామిడి ఆకుల తోరణాలు, షడ్రుచుల ఉగాది పచ్చడి, మరొక వైపు హాయిగొలిపే కోయిల గానం ఎలా గుర్తుకు వస్తాయో.. తమ భవిష్యత్ గురించి తెలుసుకోవాలనే కోరికతో పంచాంగ శ్రవణం పై కూడా అంతే ఆసక్తి కనబరుస్తుంటారు.
Ugadi rasi phalalu 2022-2023, శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు
Advertisement
ఆదాయం-14: వ్యయం -14, రాజపూజ్యం -3 అవమానం -6
శుభకృత్ నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చాలా వరకు సమానంగా ఉన్నాయి. ఆర్థిక అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యం పెరుగుతుంది. అధికార యోగం ఉంది. రాహుకేతువుల సంచారం వల్ల శ్రమ పెరిగినా సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తారు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేస్తేనే రాణించగలరు. వ్యాపారస్తులను కలిసి వస్తుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం ధనరూపంలో లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు రానీయవద్దు. ఒత్తిడి లేకుండా ఆలోచించండి తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. బందు మిత్రులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ఓర్పు చాలా అవసరం. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆదాయం -8: వ్యయం -8, రాజపూజ్యం -6, అవమానం -6
ఈ ఏడాది ఏకాదశంలో గురుబలం విశేషమైన అదృష్టాన్నీ శారీరక శక్తిని, పేరు ప్రతిష్టలను ప్రసాదిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. దైవానుగ్రహం ఉంది. కోరికలు సిద్దిస్తాయి. భూ గృహ వాహనాది శుభయోగాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా శ్రమకు తగిన గుర్తింపు తెచ్చుకుంటారు. దశమంలో శనివల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది. రాహువు వల్ల తెలియని ఖర్చులూ ఇబ్బందులు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపార యోగం బ్రహ్మండంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తమ విద్య లభిస్తుంది. శని, రాహు శ్లోకాలు చదువుకోవాలి.
ఆదాయం-11 : వ్యయం-5; రాజపూజ్యం-2; అవమానం-2
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఏకాదశంలో రాహుకాలం కార్యసిద్ధిని గౌరవాన్ని ప్రసాదిస్తుంది. జీవితాశయాలు నెరవేరతాయి. తెలివిగా పనులను పూర్తి చేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో శాంతం అవసరం. వ్యాపారం కలిసి వస్తుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారం కలిసి వస్తుంది. విద్యార్థులకు పరీక్ష కాలంగా అనిపిస్తుంది. విదేశయోగాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై దృష్టి ఉంచాలి. వృథా ప్రయాణాలు తగ్గించుకోవాలి. బాధ్యతలను ధర్మ బద్ధంగా నిర్వర్తించండి.
ఆదాయం-5 : వ్యయం -5 : రాజపూజ్యం-5 : అవమానం -2
సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఆశయాలు నెరవేరతాయి. ఆపదల నుంచి బయటపడతారు. భాగ్య గురు, రాజ్య రాహువుల వల్ల విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారం కలిసి వస్తుంది. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. గృహలాభం సూచితం. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఆనందంగా ఉంటారు. ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రశంస పురస్కారాలు అందుతాయి. ఎదురు చూస్తున్న విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి. శని, కేతువుల వల్ల మధ్య మధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకు విశేషమైన సరస్వతీ కటాక్షం సిద్ధిస్తుంది. శని, కేతు శ్లోకాలు చదువుకోవాలి.
ఆదాయం -8 ; వ్యయం 14 ; రాజపూజ్యం -1; అవమానం 5
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంయమనాన్ని పాటిస్తే అవమానాల్ని తప్పించుకోవ్చు. తృతీయ కేతు ప్రభావ వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. ఆర్థిక స్థితి క్రమంగా మెరుగు అవుతుంది. సాహస నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ఆధ్యాత్మిక చింతనలో ముందుకు సాగాలి. 6వ రాశిలో శనివల్ల ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సంకల్పబుద్ధి కలుగుతుంది. మధ్యలో గురు, రాహు గ్రహాల వల్ల స్వల్పంగా సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు రావు. బంగారు భవిష్యత్ సూచితం.
ఆదాయం -11 : వ్యయం -5 : రాజపూజ్యం -4: అవమానం-5
ఈ ఏడాది విశేషమైన ఆదాయం ఉంటుంది. చర, స్థిరాస్తులను వృద్ధి చేసే సమయం. సప్తమంలో గురుబలం విశేషమైన శుభాన్ని ప్రసాదిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు విజయవంతం అవుతుతాయి. త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో విశేషష్ట్ర ప్రతిభను కనబరుస్తాడు. రాజానుగ్రహా సిద్ధి కలుగుతుంది. శని, రాహు, కేతువుల వల్ల అప్పుడప్పుడూ తెలియని ఆటంకాలు ఎదురు అవుతాయి. ముక్కుసూటిగా వ్యవహరించవద్దు. వ్యాపారంలో బ్రహ్మండమైన లాభాలుంటాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రముఖ వ్యక్తుల సహకారం లభిస్తుంది. పలు మార్గాల్లో విజేతలుగా నిలుస్తారు. విద్యార్థులకు బ్రహ్మాండమైన ధారణాశక్తి ఉంటుంది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. అలసత్వం లేకుండా లక్ష్యాలను పూర్తి చేయండి.
Advertisement
ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1
ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని అభివృద్ధిని సాధించాలి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలు మార్గాల్లో విశేష లాభాలున్నాయి. కాలం కలిసి వచ్చి అదృష్టవంతులు అవుతారు. సాహసోపేత కార్యాలు శక్తిని ఇస్తాయి. మిత్రుల సహకారంతో భారీ లక్ష్యాలను సైతం సాధించగలుగుతారు. గురు, శని, కేతువు దోషాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది. సమయస్పూర్తి చాలా అవసరం. దేనికి తొందర వద్దు. ఆత్మీయుల సూచనలతో ఫలితం ఉంటుంది. కలహాలకు దూరంగా ఉండాలి. సహనంతోనే కార్యసాధనలో విజయాలను సొంతం చేసుకోవచ్చు. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేయాలి.
ఆదాయం -14 ; వ్యయం -14; రాజపూజ్యం -3 ; అవమానం -1
ఆదాయ వ్యయాల అధిక మొత్తంలో ఉన్నందున ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. రుణ సమస్యలకు దూరంగా ఉండాలి. విజయానికి పంచమ గురు, షష్టి రాహువుల సహకారం సంపూర్ణంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవం పెరుగుతుంది. స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి. విశేష భూలాభం, గృహయోగం వస్తు వాహన ప్రాప్తి కలుగుతాయి. సంతృప్తినిచ్చే ఫలితాలు అనేకం ఉన్నాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. వ్యాపార యోగం చక్కగా ఉంటుంది. దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అద్భుతమైన భవిష్యత్ సొంతం అవుతుంది. విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యా యోగసిద్ది కలుగుతుంది.
ఆదాయం-2 వ్యయం -8, రాజపూజ్యం-6 అవమానం -1
ఈ ఏడాది అధిక మొత్తంలో ఖర్చును సూచిస్తోంది. ఆదాయ వనరులను అభివృద్ధి పరుచుకునే మార్గాలను అన్వేషించాలి. రాజపూజ్యం అధికంగా ఉన్నందున ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తుంది. మీ ప్రతిభను అందరూ గుర్తించి సముచితమైన స్థానాన్ని ఇస్తారు. సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి. సంవత్సరం మధ్యలో కొన్ని కార్యాలు విజయవంతం అవుతాయి. లాభ కేతువు వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. గురు, శనుల వల్ల కొన్ని విఘ్నాలు ఎదురవుతాయి. చిత్తచాంచల్యం లేకుండా నిర్ఎణయాలు తీసుకోవాలి. ఆర్థిక నష్టాన్ని నివారించాలి. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. దగ్గరి వారితో విభేదాలు రాకుండా వ్యవహరించాలి. చేస్తున్న పనుల్లో స్పష్టత అవసరం. ఒకటికి రెండు సార్లు ఆలోచించి పని చేయండి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే అధికారుల ప్రశంసలు అందుకుటారు. ఒత్తిడిని జయించాలి. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించాలి. స్థిర చిత్తంతో చేసే పనులు త్వరగా లక్ష్యాన్ని చేరుస్తాయి.
ఆదాయం-5 వ్యయం-2 రాజపూజ్యం-2 అవమానం-4
ఈ ఏడాది ఆదాయం గతం కంటే ఉత్తమంగా ఉంటుంది. స్థిరాస్తులు వృద్ధిచేస్తారు. ధనం నిలువ చేయడానికి అనుకూలమైన సమయమిది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. మనోబలంతో అభిష్టాలు సిద్ధిస్తాయి. కీర్తీ ప్రతిష్టలను సాధిస్తారు. శని, గురువు రాహువుల వల్ల మధ్య మధ్యలో అనేక విఘ్నాలు ఎదురవుతాయి. మంచితనం కాపాడుతుంది. ధర్మబుద్దితో పని చేస్తే కష్టాలు తొలగిపోతాయి. మొహమాటం వల్ల ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి తెలివిగా బయటపడాలి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలుంటాయి. పనుల సకాలంలో పూర్తి చేయండి. బంగారు భవిష్యత్ లభిస్తుంది. తోటివారి సూచనలు అవసరం అవుతాయి. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. బంధు మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది. తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విద్యార్థులు ప్రణాళికతో మంచి ఫలితాలను సాధిస్తారు.
ఆదాయం -5,: వ్యయం -2 : రాజపూజ్యం-5 : అవమానం 4
ఆదాయం అద్భుతంగా ఘనకీర్తి లభిస్తుంది. స్పష్టమైన ఆలోచనావిధానంతో అభివృద్ధిని సాధిస్తారు. ధన సౌఖ్యం, యశోవృద్ధి కలుగుతాయకి. అదృష్టవంతులు అవుతారు. ఇష్టకార్యసిద్ధి ఉంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వ్యాపరాస్తులకు విశేషమైన లాభాలున్నాయి. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. దైవానుగ్రహం సిద్ధిస్తుంది. శని, కేతువుల వల్ల స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలి. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు.
ఆదాయం-2 ; వ్యయం -8 ; రాజపూజ్యం-1 : అవమానం -7
ఈ సంవత్సరం మొహమాటం తగ్గించి ఖర్చును నియంత్రించండి. అవమానం అధికంగా గోచరిస్తోంది. ప్రతి పనీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి ఏకాదశంల శనివల్లఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆపదలు తొలగిపోతాయి. గురు, రాహు, కేతు దోషాల వల్ల తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. ధర్మమార్గంలో ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి. నమ్మకంతో ప్రయత్నిస్తే సరస్వతీ కటాక్షం లభిస్తుంది. గృహ నిర్మాణాది ప్రయత్నాలు విజయాన్నిస్తాయి.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ఉగాది వేళ శుభవార్త