దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. దీంతో కస్టమర్లు కూడా వాటిపైనే వాటి వైపు ఎక్కువగానే మొగ్గు చూపుతున్నారు. ఇక కాలిఫోర్నియా కు చెందిన ఎలక్ట్రిక్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీ ని తెలంగాణ లో ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది.
Advertisement
ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి రాహుల్ గయాం వెల్లడించారు. ప్రతి సంవత్సరం 2,40,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అమెరికాకు చెందిన విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ కంపెనీ ఫిస్కర్ హైదరాబాదులో లో తమ రెండో ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కంపెనీ సరసన ఎలక్ట్రిక్ కంపెనీ ఏర్పాటు కానుంది.
Advertisement
ఈ కొత్త ప్లాంట్‌లో 150 మిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్లాంట్ తయారీ తో దాదాపు 3 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. దీంతో నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం బిలిటీ కంపెనీ హైదరాబాద్ కు చెందిన గయాం మోటార్ వర్క్స్ తో కలిసి త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయనుంది.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని ప్రారంభించిందని తెలిపారు. బిలిటీ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఫ్యాక్టరీని ప్రారంభించబోతుందన్నారు. ఈ ఏడాది బిలిటీ కంపెనీదే అతిపెద్ద పెట్టుబడి అని పేర్కొన్నారు కేటీఆర్.
ఇవి కూడా చదవండి :
- మెగాస్టార్ ఆచార్య రన్ టైమ్ ఎంతంటే..?
- యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?
- ది వారియర్ : బుల్లెట్ సాంగ్ పై రాక్‌స్టార్ ఏమన్నారో తెలుసా..?