ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ బాట పడుతున్న విషయం తెలిసిందే. అక్కడ కూడా తమ సత్తా చాటుకొని ఆ హీరోల చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభాస్, అల్లుఅర్జున్, చరణ్, తారక్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు బాలీవుడ్ లో పాగా వేశారు. వీరి గురించి బాలీవుడ్ స్టార్ హీరోలు ఓ రేంజ్‌లో చెప్పుకుంటూ వస్తారు.
Advertisement
Also Read : పెళ్లి తర్వాత కొత్త జీవితం సింగర్ సునిత ఏమన్నదంటే..?
Ad
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్‌సింగ్ రామ్ చరణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ సెషన్ చేసిన రణవీర్‌కు ఒక నెటిజన్ రామ్ చరణ్ గురించి చెప్పమని అడిగాడు.
ఇక దీనికి సమాధానంగా ఈ యంగ్ హీరో అతనొక మృగం. ఒక పరిపూర్ణ యంత్రం. మగధీర చూసినప్పటి నుంచి చెర్రినీ అభిమానిస్తున్నాను. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. పనిలో రాక్షసుడు. ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడని చెర్రినీ, రణవీర్ పొగడంతో చరణ్ అభిమానులు రచ్చచేస్తున్నారు. ఇక ఈ మాటలతో బాలీవుడ్ లో చరణ్ రేంజ్ ఏమిటి అనేది తెలుస్తోంది. చరణ్‌తో రణవీర్ కు మంచి స్నేహ బంధమే ఉంది. చరణ్-శంకర్ సినిమా పూజా కార్యక్రమానికి రణవీర్ ముఖ్యతిథిగా హాజరైన విషయం తెలిసినదే.
Advertisement
Also Read : అదృష్టం అంటే ఈమెదె.. 50 ఇంటర్వ్యూల్లో ఫెయిల్.. కోటి ఫ్యాకేజీతో జాబ్..!