Home » నరేష్ నన్ను అలా చేసేవాడు అంటూ ప్రైవేట్ విషయాన్ని బయటపెట్టిన రమ్య రఘుపతి..!!

నరేష్ నన్ను అలా చేసేవాడు అంటూ ప్రైవేట్ విషయాన్ని బయటపెట్టిన రమ్య రఘుపతి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ కి చెందిన నరేష్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ వ్యక్తిగత జీవితంలోనే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ వైరల్ అవుతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని వారితో విడిపోయి నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ సందర్భంగా తాను పవిత్ర ను పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించారు. ఈ తరుణంలోనే మూడో భార్య రమ్య రఘుపతి కి విడాకుల కోసం నోటీస్ కూడా పంపినట్టు తెలుస్తోంది.

Advertisement

also read;చంటి లాంటి హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

ఈ క్రమంలోనే రమ్య రఘుపతి తీవ్రంగా స్పందించింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నరేష్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టింది. ఇంతకీ అవి ఏంటయ్యా అంటే .. నరేష్ నాకు విడాకులు ఇచ్చి మరో మహిళతో ఉండాలని చూస్తున్నారు. కానీ నాకు నరేష్ తోనే ఉండాలని ఉంది అంటూ తెలియజేసింది. ఆయన ఎప్పటికైనా మారి నా వైపు చూస్తారని ఆశతో ఎదురుచూస్తున్నానని అన్నది. నరేష్ ఎప్పుడైనా సరే తప్పు చేసినప్పుడు నా దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతూ కాళ్లు పట్టుకొని ఏడుస్తూ ఉండేవాడని వారు కలిసి ఉన్నప్పుడు జరిగిన సంఘటనను బయట పెట్టేసింది.

Advertisement

నాకు ఒక బాబు ఉన్నాడని వాడికి డైవర్స్ అంటే ఏంటో అర్థం కూడా తెలియదని బాధపడ్డారు. నరేష్ నా నుంచి విడిపోవడానికి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఎ*ర్లు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. నేను రాఖీ కట్టిన వ్యక్తితో నాకు ఎ*ర్ ఉందని ప్రచారం చేశాడని,అది నన్ను ఎంతగానో బాధించిందని తెలియజేసింది. నరేష్ కేసుల వల్ల నేను ఎన్జీవో కు దూరం కావాల్సి వచ్చిందని, నాకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయని నరేష్ వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని కామెంట్స్ చేశారు. రమ్య రఘుపతి ఈ విధమైన కామెంట్స్ చేయడంతో మరోసారి ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read;ఏపీ హైకోర్టు ఉద్యోగాలు..నెలకు రూ.1,47,760ల జీతం.. పూర్తి వివరాలు ఇవే

Visitors Are Also Reading