నటీ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె నటనలో ఏపాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతుంటుంది. నీలాంబరిగా ఆడియన్స్ మదిలో నిలిచిపోయిన సీనియర్‌నటి రమ్యకృష్ణ యువతరం మదిలో శివగామిగా చెరగని ముద్ర వేశారు. ఆమె తన సుదీర్ఘ ప్రయాణంలో వైవిద్యమైన పాత్రలను పోషిస్తూ ఇప్పటికీ కెరీర్‌లో నటిగా దూసుకెళ్తున్నారు. ఈ జర్నీలో రమ్యకృష్ణ ఓ నటుడికి చెల్లిగా, కూతురిగా, భార్యగా నటించారు. అతను ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా రమ్యకృష్ణ వైవిద్యమైన పాత్రలతో మెప్పించి ప్రశంసలను అందుకుంటున్నారు. ఈమె సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఒక నటుడికి చెల్లిగా, కూతురుగా, భార్యగా నటించారు.
ఇది కూడా చదవండి : పురుషుల్లో ఉండే ఈ 5 లక్షణాలను మహిళలు ఎక్కువ ఇష్టపడతారట…! అవి ఏంటంటే…?
Advertisement
అతను మరెవ్వరో కాదండోయ్.. విలక్షణ నటుడు నాజర్. సౌందర్య-రజినికాంత్ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం నరసింహా సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరి అనే ఓ పవర్ పుల్ పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమాలో ఆమెకు అన్నయ్యగా నాజర్ నటించారు. వంత రాజవతాన్ వరువేన్ చిత్రంలో నాజర్‌కి కూతురిగా కనిపించారు రమ్యకృష్ణ. ఈ చిత్రాన్ని తెలుగులో అత్తారింటికి దారేది రీమేక్‌గా తెరకెక్కించారు. అదేవిధంగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన అద్భుతం సృష్టించిన బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ నాజర్ భార్యగా నటించి ప్రేక్షకుల మదిని దోచేశారు. ఇలా ఒకే నటుడితో చెల్లిగా, కూతురిగా, భార్యగా నటించిన ఘనత ఒక రమ్యకృష్ణకే దక్కిందనే చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి : ఛార్మీ ఉంటే ఆ హీరోలు పూరీతో సినిమాలు చేయమని చెప్పారా..? ఆ దెబ్బతో ఇద్దరూ విడిపోతున్నారా…?