Telugu News » Blog » ఛార్మీ ఉంటే ఆ హీరోలు పూరీతో సినిమాలు చేయ‌మ‌ని చెప్పారా..? ఆ దెబ్బ‌తో ఇద్ద‌రూ విడిపోతున్నారా…?

ఛార్మీ ఉంటే ఆ హీరోలు పూరీతో సినిమాలు చేయ‌మ‌ని చెప్పారా..? ఆ దెబ్బ‌తో ఇద్ద‌రూ విడిపోతున్నారా…?

by AJAY
Ads

రీసెంట్ గా వ‌చ్చిన లైగ‌ర్ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ఈ సినిమాకు పూరీజ‌గ‌న్నాత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా అన‌న్య‌పాండే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాను పూరీ జ‌గ‌న్నాత్ ఛార్మీ క‌లిసి బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ తో సంయుక్తంగా నిర్మించారు. పాన్ ఇండియా లెవ‌ల్ లో భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో ఛార్మీ, పూరీలో తీవ్రంగా న‌ష్ట‌పోయినట్టుగా టాక్ వినిపిస్తోంది.

Ads

ఇదిలా ఉంటే ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పూరీ ఛార్మీల రిలేష‌న్ షిప్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ అవ్వ‌డంతో ఛార్మీ వ‌ల్లే అని అన్నారు. లైగ‌ర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఛార్మీ వ‌ల్లే ఫ్లాప్ అయింద‌ని అంటున్నార‌ని అయితే ఈ రెండూ నిజం కాద‌ని అన్నారు. క‌థ స‌రిగ్గా ఎంపిక చేస్తే ఏ సినిమా అయినా హిట్ అవుతుంద‌ని చెప్పారు. ఛార్మీ సినిమా నిర్మాణం వ‌ర‌కే అని క‌థ‌లో వేలు పెట్టదు కాబ‌ట్టి ఆమెపై విమ‌ర్శ‌లు త‌ప్ప‌ని అన్నారు.

Ads

అంతే కాకుండా పూరీ జ‌గ‌న్నాథ్ బాల‌య్య లాంటి మాస్ హీరోతో ఇప్పుడు సినిమా చేస్తే బాగుంటుంద‌ని అన్నారు. బాల‌య్య ద‌ర్శ‌కుడి హిట్ ఫ్లాప్ ప‌ట్టించుకోకుండా క‌థ న‌చ్చితే సినిమాలో న‌టిస్తార‌ని చెప్పారు. కాబ‌ట్టి పూరీ జ‌గ‌న్నాథ్ కు ఇప్పుడు బాల‌య్య మంచి ఆప్ష‌న్ అని చెప్పారు. అంతే కాకుండా ఒకవేళ నిర్మాణ బాధ్య‌తలు వేరేవాళ్లు తీసుకుంటే ఛార్మీ త‌ప్పుకుంటుంది.

Ad

పూరీకి కూడా కొన్ని ప‌రిమితులు ఉంటాయంటూ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే పూరీ ప‌క్క‌న ఛార్మీ ఉంటే హీరోలు సినిమాలు చేయ‌మ‌ని చెబుతున్నారంటూ నెట్టింట ట్రోల్స్ వ‌స్తున్నాయి. అంతే కాకుండా అందుకే ఇద్ద‌రూ విడిపోతున్నారంటూ కూడా టాక్. ఈ నేప‌థ్యంలో జ‌ర్న‌లిస్ట్ భ‌ర‌ద్వాజ ఆ రూమ‌ర్స్ పై క్లారిటీ ఇచ్చారు.