Home » ఎన్టీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వకుంటే హీరోయిన్ వాణిశ్రీ ఏమైపోయేదో తెలుసా..?

ఎన్టీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వకుంటే హీరోయిన్ వాణిశ్రీ ఏమైపోయేదో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అలనాడు ఎన్టీఆర్ బిఏ చదివే రోజుల్లో నిమ్మకూరు నుంచి సైకిల్ మీద వచ్చేవారు. ఆయన ప్రతి రోజూ విజయవాడలోని లక్ష్మీ టాకీస్ లో షో మొదలు కాక ముందు డ్రామా హాల్ లో జరిగే నాటకాల్లో నటించేవారు. ఇక అప్పటి నుంచి థియేటర్ యజమానుల్లో ఒకరైన జగన్నాధ రావు తో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహమే మద్రాస్ వరకు వెళ్ళింది.

Advertisement

ఆయన ఎస్ వి ఎస్ ఫిలిమ్స్ స్థాపించి నిర్మించిన చిత్రాల్లో నిండు హృదయాలు సినిమా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ చిత్ర దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్. ఈయన మొదటి చిత్రం ఆత్మ గౌరవం సినిమా లో హీరో అక్కినేని అయినా, ఆ తర్వాత పాతికేళ్లకు కానీ వీరిద్దరి కాంబినేషన్లో మూవీ రాలేదు. ఆత్మ గౌరవం తర్వాత విశ్వనాధ్ తెరకెక్కించిన నాలుగు సినిమాల్లో ఎన్టీఆర్ హీరో..

also read:అరటి ఆకులో భోజనం ఎందుకు చేస్తారంటే.. దీనిలో ఉండే ఆ శక్తి మనకి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే మీరు విడిచిపెట్టరు..!!

Advertisement

ఇందులో ముఖ్యంగా “నిండు హృదయాలు” మూవీ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ సినిమా లో వాణిశ్రీ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇందులో విశేషం ఏముంది అంటారా.. ఆ సమయంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కృష్ణకుమారి హఠాత్తుగా సినిమాలు మానేయడం తో, ఆ అదృష్టం వాణిశ్రీ ని వరించింది. అప్పటివరకు కామెడీ పాత్రలు ఇతర క్యారెక్టర్లు చేస్తున్నా వాణిశ్రీ ని ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నారు. వాణిశ్రీ నా పక్కన హీరోయిన్ ఏంటి అని ఎన్టీఆర్ ఆ సమయంలో అని ఉంటే మాత్రం ఆమె ఈనాడు స్టార్ కథానాయికగా పేరు తెచ్చుకునేది కాదు. కానీ ఆయన వాణిశ్రీ కి కథానాయికగా ఎంతో ప్రోత్సాహం అందించారు. వాణిశ్రీ కూడా అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంది.

 

ఈ క్రమంలోనే దుక్కిపాటి తమ ఆత్మీయుల లో హీరో చెల్లెలి పాత్ర వేయమంటే, లేదండి ఎన్టీ రామారావుకు హీరోయిన్ గా చేస్తున్నానని ఇక చెల్లెలి పాత్రలు చెయ్యను అని చెప్పిందట. ఇక నిండు హృదయాలు సినిమాలో వాణిశ్రీ ఎన్టీఆర్ కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతో మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రం విజయవాడలోని జైహింద్ టాకీస్ లో వంద రోజులకు పైగా ఆడి సంచలనం సృష్టించింది. ఈ మూవీలోని రామ లాలి మేఘ శ్యామ లాలి అనే సినారె పాట ఎంతో పాపులర్ అయింది. ఈ విధంగా ఎన్టీఆర్ వాణిశ్రీ కి లైఫ్ ఇచ్చి ఆమె కెరీర్ను మలుపు తిప్పడంలో ముఖ్య పాత్ర పోషించారు.

also read:

Visitors Are Also Reading