చరణ్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో మార్చి 25న బొమ్మ థియేటర్లో పడనుంది. దాంతో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా కనిపిస్తోంది. ఎన్టీఆర్ చరణ్ అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు. ఇప్పటికే బుకింగ్ లు ప్రారంభం అవ్వడంతో సీట్లు నిండిపోతున్నాయి. మరోవైపు దేశవిదేశాల్లో ఉన్న అభిమానులు కూడా సినిమా విడుదలకు ముందే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు.
Advertisement
Advertisement
రీసెంట్ గా ఎన్టీఆర్ అభిమానులు కార్ లతో ఆర్ఆర్ఆర్ మరియు ఎన్టీఆర్ అంటూ రాసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా రామ్ చరణ్ అభిమాని ఒకరు కాలిఫోర్నియాలో చరణ్ కటౌట్ పెట్టుకుని జీప్ తో ర్యాలీ తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో రామ్ చరణ్ అభిమానులు కుషీ అవుతున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు విడుదలకు మందే ఈ రేంజ్ లో సెలబ్రేషన్స్ ఉంటే సినిమా విడుదల తరవాత ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Advertisement