తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి విలన్ పాత్రలో మెప్పించి హీరోగా మారారు గోపీచంద్. ఆయన ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులు అనే తేడా లేకుండా దూసుకుపోతున్నారు. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ తర్వాత హీరో గోపీచంద్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించిన మూవీ రామబాణం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
READ ALSO : త్రిష ప్రియుడితో డేటింగ్ లో ఉన్నా : బిందు మాధవి
Advertisement
ఇందులో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్గా చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో సీనియర్ నటులు జగపతిబాబు, కుష్బూ, ఆలీ, సప్తగిరి, గెటప్ శ్రీను లాంటివారు కీలకపాత్రలో నటించారు. మొదటి రోజు ఈ చిత్రానికి కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ స్లో స్లోగా కొనసాగుతున్నాయి. ఇకపోతే సాధారణంగా అయితే ఏ దర్శకుడు అయినా కథ సిద్ధం చేసుకున్నప్పుడు తన కథకు తగ్గ హీరో ఎవరో కూడా ఒక అంచనాకు వస్తారు.
Advertisement
READ ALSO : Newsense : ‘న్యూసెన్స్’ ట్రైలర్.. మీడియాను టార్గెట్ చేశారా?
అలాగే శ్రీవాస్ సైతం రామబాణం కథ రెడీ చేసుకున్నాక తన సినిమాకు ఓడ్డు పొడవు బాగా ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ ను మొదట అనుకున్నారట. అనుకున్నట్టుగానే కథ మొత్తం కూడా వరుణ్ తేజ్ కి వినిపించారట. కానీ ఇంత ఫ్యామిలీ డ్రామాతో పాటు ఎమోషన్ తనకు అస్సలు సూట్ కావని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు వరుణ్ తేజ్. దీంతో గోపీచంద్ ఈ సినిమాను చేశారు.
READ ALSO : Rakul Preet Singh : బికినీలో మంచునే కలిగిస్తున్న రకుల్ ప్రీత్… వీడియో వైరల్