Home » Ram Charan : రామ్ చరణ్, రణవీర్ సింగ్ కాంబోలో మల్టీ స్టారర్? సర్ ప్రైజ్ టీజర్ అదిరిందిగా!

Ram Charan : రామ్ చరణ్, రణవీర్ సింగ్ కాంబోలో మల్టీ స్టారర్? సర్ ప్రైజ్ టీజర్ అదిరిందిగా!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

కూతురు పుట్టిన నేపథ్యంలో రామ్ చరణ్ గత కొన్ని నెలలుగా షూటింగ్స్ కు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన కూతురు క్లిన్ కార తో సమయం గడుపుతున్నారు. కాగా, త్వరలోనే ఆయన సినిమా షూటింగ్స్ కు రానున్నట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది ఇలా ఉంటె.. ఈ సినిమా ప్రారంభోత్సవానికి రణవీర్ అతిధిగా వచ్చారు. ఆ సమయంలో చరణ్, రణవీర్ తీసుకున్న ఫొటోస్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యారు. ఈ ఈవెంట్ కు కియారా అద్వానీ కూడా హాజరు అయ్యారు.

Advertisement

అయితే.. తాజాగా చరణ్, రణవీర్ కాంబోలో రాబోతున్న ఓ సినిమాకు సంబంధించి సర్ ప్రైజ్ టీజర్ విడుదల అయ్యింది. ఈ వీడియో ను చూసి ఇటు మెగా అభిమానులు అటు రణవీర్ అభిమానులు నిజంగానే సర్ ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే.. ఇప్పటివరకు వీరిద్దరూ కాంబోలో సినిమా రాబోతోందన్న సంగతే ఎవ్వరికీ తెలియదు. సడన్ గా టీజర్ విడుదలయ్యి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఈ వీడియో ను బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ షేర్ చేసారు. ఈ పోస్ట్ కి “సీక్రెట్ ను బయటపెడదాం ” అని కాప్షన్ కూడా రాసుకొచ్చారు రణవీర్. సో మెగా అభిమానుల కోసం బిగ్ సర్ ప్రైజ్ ఎదురుచూస్తోందన్నమాట.

Advertisement

ఈ సినిమాలో దీపికా పడుకునే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తూ కనిపిస్తుంది. ఆ తర్వాత రణవీర్ సార్ టార్గెట్ కనిపించింది అని అంటాడు. తర్వాతి సీన్లో ఓ ఆఫీసర్ రామ్ చరణ్ ను ఏజెంట్ గో గో అనడంతో పరిగెత్తుతూ కనిపిస్తాడు. ఈ వీడియో చివరిలో త్రిష కూడా కనిపించడం విశేషం. అసలు ఒక్క విషయం కూడా బయటకు రాకుండా షూటింగ్ ఎప్పుడు తీశారో అని మెగాఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ కీలక అప్డేట్.. అభిమానులకు పండుగే..!

Allu Arjun: సినిమాల్లోకి రాకముందు అల్లు అర్జున్ ఆ పని చేసేవాడా? మొదటి సంపాదన ఎంతంటే?

Visitors Are Also Reading