Home » Ram Charan: ఏంటి డైరక్టర్ గారూ.. ఆ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ నిజం కాదా..?

Ram Charan: ఏంటి డైరక్టర్ గారూ.. ఆ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ నిజం కాదా..?

by Sravya
Ad

Ram Charan : ఏ సినిమా సక్సెస్ అవుతుందనేది ఎవరు ఊహించలేము ఈ రోజుల్లో చిన్న సినిమాలో పెద్దపెద్ద హిట్స్ ని అందుకుంటున్నాయి. భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తేజ తన తండ్రి కీర్తి ప్రతిష్టలను పెంచుతూ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలని సంపాదించుకున్నాడు. రామ్ చరణ్ సినీ కెరియర్ లో రంగస్థలం సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఉంది.

Advertisement

సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకి వచ్చిన ఈ మూవీలో చరణ్ నటన అద్భుతం అని చెప్పొచ్చు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ సింపుల్ గా ఉంటుంది. సాధారణ వ్యక్తి లాగ సైకిల్ మీద వస్తు ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ గురించి సుకుమార్ ఒక సందర్భంలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పారు ఒక సాధారణ వ్యక్తుల సైకిల్ తొక్కుతూ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది.

Advertisement

Also read:

Also read:

ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్. అందుకని సైకిల్ని చూపించానని అన్నారు లాంగ్ షాట్ లో వంతెన పై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా చరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా ని ఉపయోగించాము. నేను అనుకున్న విధంగా ఈ షాట్ రాకపోవడంతో ఆ సీన్ ని సీజీ వర్క్ పూర్తి చేసామని సుకుమార్ అన్నారు. రియల్ కాదు సిజీ వర్క్ అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు ఏది ఏమైనా రంగస్థలం సినిమా రామ్ చరణ్ కి పెద్ద హిట్ ఇచ్చింది ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading