మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు రామ్ చరణ్. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు సాధించారు. అలాంటి రామ్ చరణ్, రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా పాన్ ఇండియా హీరోగా మారారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి.
read also : IPL 2023 : ధోని ఫ్యాన్స్ కు బిగ్ షాక్… కీపింగ్ పై కీలక నిర్ణయం!
Advertisement
శంకర్ డైరెక్షన్లో రాబోతున్న గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉండగా రాంచరణ్ ఐపిఎల్ లో అడుగు పెట్టనున్నారు. తెలంగాణ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ లా… ఏపీ నుంచి కూడా ఒక టీం ఐపీఎల్ లో పాల్గొనాలని రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
Advertisement
read also : Dasara: ఓటీటీలోకి ‘దసరా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది రామ్ చరణ్ ఫ్రాంచైజీ నుంచి ఒక కొత్త టీం ఐపీఎల్ లో అడుగు పెట్టనుందని తెలుస్తోంది. వైజాగ్ వారియర్స్ పేరు పెట్టినట్లు సమాచారం. నటుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రామ్ చరణ్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. పోలో టీం, ట్రూ జెట్ విమానయాన సంస్థల అధినేతగా, సినీ నిర్మాతగా సత్తా చాటిన చరణ్ ఇప్పుడు ఐపీఎల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
read also : IPL 2023 : ధోని ఫ్యాన్స్ కు బిగ్ షాక్… కీపింగ్ పై కీలక నిర్ణయం!