భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం ఢిల్లీ యూనివర్సిటీ స్నాతకోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రాజ్ నాథ్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ మరియు రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం పై భారత్ వైఖరి ఏమిటి అన్న దానిపై రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.
Advertisement
Advertisement
ఇతర దేశాలపై దాడి చేయడం గాని ఇతర దేశాల భూభాగంపై దురాక్రమణకు పాల్పడటం కానీ చేయని ఓకే ఒక దేశం భారతదేశం అని వ్యాఖ్యానించారు. ఇండియా శక్తి ప్రపంచ సంక్షేమం కోసమే అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్ శక్తి ఏ ఒక్కరినో భయపెట్టడానికి కాదని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ప్రపంచానికి గురువుగా మారాలన్నదే భారతదేశం కల అని… దేశం శక్తివంతంగా మారి విజ్ఞానం విలువలను కలిగి ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇతర దేశాల పై దాడి చేయడం కానీ దురాక్రమణలకు పాల్పడటం లాంటి విషయాలని ఎప్పుడూ భావించలేదు అన్నారు.