ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ప్రెసర్ అనే పదం బాగా చెక్కర్లు కొడుతుంది. అయితే క్రికెట్ లో ఉన్న మూడు ఫార్మాట్ లలో ఈ ఒత్తిడి వల్ల ఆడలేకపోతున్నం అని మంచి మంచి ఆటగాళ్లు ఎదో ఒక్క ఫార్మాట్ కు రిటైర్మెంట్ అనేది ఇచ్చేసి.. మిగిలిన రెండు ఫార్మట్స్ పై ఫోకస్ అనేది చేస్తున్నారు. ఇక ఈ దారిలోనే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పయనిస్తున్నాడు అని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.
Advertisement
ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత.. కింగ్ కోహ్లీ పొట్టి కు వీడ్కోలు చెప్పి.. కేవలం టెస్ట్ మరియు వన్డేలలో మాత్రమే కొనసాగుతాడు అనే వార్తలు ఈ మధ్య మంచి జోరు మీద ఉన్నాయి. అందువల్ల కోహ్లీ ఫ్యాన్స్ కొంత ఆందోళనకు గురవుతున్నారు. కానీ వారి భాధను కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ దూరం చేసారు.
Advertisement
తాజాగా ఆయన మాట్లాడుతూ.. కోహ్లీ రిటైర్మెంట్ పై వస్తున్న అన్ని వార్తలు అబ్బదమ్. విరాట్ ఎన్నో రోజుల నుండి జట్టుకు సేవలు అందిస్తున్నాడు. అతని ఫిట్నెస్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మధ్యే ఆసియా నుండి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. అతను ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక ఈ ప్రపంచ కప్ కాకుండా 2024 లో జరిగే పొట్టి ప్రపంచ కప్ లో కూడా కోహ్లీ ఆడుతాడు అని ఆయన పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :