Home » ఆ యంగ్ హీరోలో సినిమాలో న‌టించ‌నున్న ర‌జినీకాంత్‌..!

ఆ యంగ్ హీరోలో సినిమాలో న‌టించ‌నున్న ర‌జినీకాంత్‌..!

by Anji
Ad

సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో 169 వ చిత్రం “జైలర్” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్ ను స్టైలిష్ గా చూపించడంతోపాటు “జైలర్” గా డిఫరెంట్ అవతారంలో ప్రజెంట్ చేయాలని నెల్సన్ భావిస్తున్నారట. ఇక ఈ చిత్రానికి యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నారు.

Also Read : Ginna movie review: జిన్నా మూవీ రివ్యూ& రేటింగ్.. ఎలా ఉందంటే..?

Advertisement

ఈ చిత్రంలో రజనీకాంత్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీనియ‌ర్ న‌టి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది. తమన్నా కంటే ముందే ఈ పాత్ర కోసం ప్రియాంక మోహన్ ని తీసుకున్నారట. కానీ నెల్సన్ తో జరిగిన ఓ చిన్న వివాదం వల్ల ప్రియాంక ఈ రోల్ కి నో చెప్పిందట. దీంతో తమన్నాను తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Advertisement

Also Read : Prince movie review: శివకార్తికేయన్ ప్రిన్స్ సినిమా రివ్యూ….ఆ ఒక్కటి మిస్ అయ్యిందా…?

ఇక ఇదిలా ఉండ‌గా.. తాజాగా రజినీకాంత్ గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హీరో అధర్వ సినిమాలో రజనీకాంత్ ఓ చిన్న పాత్రలో కనిపించనున్నట్టు సినీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రజినీకాంత్ చిన్న క్యామియో రోల్ లో కనిపించనున్నారట. ఈ సినిమాని రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో అధర్వతో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న‌ రావాల్సి ఉంది.

Also Read : Ori devuda movie review: ఓరి దేవుడా మూవీ రివ్యూ, రేటింగ్..హిట్టు పడ్డట్టేనా..?

 

Visitors Are Also Reading