Home » Ginna movie review: జిన్నా మూవీ రివ్యూ& రేటింగ్.. ఎలా ఉందంటే..?

Ginna movie review: జిన్నా మూవీ రివ్యూ& రేటింగ్.. ఎలా ఉందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచు విష్ణు మొనగాళ్లు లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత జిన్నా అనే మూవీ తో భారీ అంచనాల మధ్య మన ముందుకు వచ్చారు. మూవీ ట్రైలర్ మరియు ప్రచార కార్యక్రమాలు మనలో మరింత ఆసక్తిని పెంచాయి. ఎట్టకేలకు ఈ సినిమా అక్టోబర్ 21 న విడుదలైంది.. మరి ఈ సినిమా ఎలా ఉందో విశేషాలేమిటో చూద్దాం..

Advertisement

సినిమా : జిన్నా
డైరెక్టర్: సూర్య
నటీనటులు: విష్ణు మంచు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిషోర్, సద్దాం, నరేష్
నిర్మాత: మంచు విష్ణు
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ :ఛోటా కె. నాయుడు
రిలీజ్ డేట్: అక్టోబర్ 21, 2022

కథ : తిరుపతి కి చెందినటువంటి జిన్నా తన ఫ్రెండ్స్ తో కలిసీ తిరుపతిలో టెంట్ హౌస్ నడుపుతుంటాడు. ఈ క్రమంలోనే ఆయన ఒక గుండా దగ్గర అప్పులు చేయడంతో దాన్ని తిరిగి తీర్చలేక పరారీలో ఉంటాడు. చివరికి ఆ గుండా జిన్నా ని పట్టుకుంటాడు. అతని అప్పు తీర్చడానికి ఒక షరతు కూడా పెడతాడు. అదేంటంటే తన సోదరి అయిన ( సన్నీ లియోన్ )ను వివాహం చేసుకోవాలని అంటాడు. దీంతో చేసేదేమీ లేక పెళ్లికి ఒప్పుకుని తన ఇంట్లో ప్రవేశిస్తాడు.. ఇక్కడే అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. చివరికి ఇంట్లో ఏం జరుగుతుంది?అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది..

also read:కవలలకు జన్మనిచ్చిన తల్లి పై నయన్ క్లారిటీ…! అన్నీ చెప్పేసిందిగా…!

Advertisement

సినిమా చూస్తున్న సమయంలో హీరో ఇంట్రడక్షన్, దీని తర్వాత ఒక పాట వారి స్నేహితులతో కలిసి కొన్ని కామెడీ సన్నివేశాలు, అమ్మాయి హీరోతో ప్రేమలో పడటం వంటి ఫార్మాట్లో మనం సినిమాలు చూస్తూనే ఉన్నాం. కథ కాస్త పాతదైనా ఫస్ట్ ఆఫ్ ఆకర్షనీయమైన కామెడీ సన్నివేశాలు బోరింగ్ స్క్రీన్ ప్లే తో సాగింది. ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకులకు సెకండాఫ్ బాగా ఉంటుందని భావించారు. కానీ జాణార్ కూడా పాతది కాబట్టి మనకు ఎలాంటి క్యూరియాసిటీ కలిగించదు. సెకండ్ హాఫ్ లో పూర్తిగా హర్రర్ ఎలిమెంట్స్ ఫోకస్ చేయడంతో పాటుగా రొటీన్ సన్నివేశాలతో సినిమా వేగం చాలా తగ్గుతుంది.

కానీ జిన్నాగా మంచు విష్ణు కామెడీ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. ఆయన విజయవంతమైన చిత్రాల్లో ఢీ సినిమా ను గుర్తు చేస్తుంది. కామెడీ తప్ప మిగతా విషయాల్లో ఆయన ఏ విషయాల్లో కూడా అలరించలేకపోయారు. అసలు పాయల్ రాజ్ పుత్ పాత్రతో సంబంధమే లేదు. కేవలం ఆమెతో సన్నిహితంగా మెదిలే పాత్ర మాత్రమే రూపొందించబడింది. ఇక సన్నీలియోన్ విషయానికి వస్తే ఎప్పటిలాగే ఆమె గ్లామర్ తో నిలిచిపోయింది. ఇక మిగతా నటీనటులు వెన్నెలకిషోర్ సద్దాం, నరేష్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా సినిమా చాలా యావరేజ్ అని చెప్పవచ్చు. బీజీఎం ఇవ్వడంలో అనూప్ రూబెన్స్ కాస్త విఫలమయ్యాడని చెప్పవచ్చు. మొత్తానికి జిన్నా మూవీ పాత కాలానికి చెందిన హారర్ కామెడీ మూవీ.. ఒకసారి చూసేయొచ్చు..

ప్లస్ పాయింట్ :హాస్య సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్ : రొటీన్ స్క్రీన్ ప్లే, పేలవమైన ప్రదర్శనలు,

రేటింగ్:2.5/5

also read:

Visitors Are Also Reading