ఇండస్ట్రీ లో ఎన్టీఆర్ కు రాజీవ్ కు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ స్క్రీన్ కాకుండా.. ఆఫ్ స్క్రీన్ వీరి రిలేషన్ వేరే లెవెల్ లో ఉంటుంది. చాలా వరకు తారక్ సినిమాల్లో రాజీవ్ కూడా కనిపిస్తూనే ఉంటారు. ఇక ఫ్రెండ్స్ ని డైరెక్ట్ గా కలవడం తారక్ తగ్గించారు. కానీ, ఫోన్ లో ద్వారా మాత్రం కాంటాక్ట్ లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. తారక్ కి రాజీవ్ సన్నిహితుడు కావడంతో.. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఎపి స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి నెలపైనే కావొస్తోంది. అయితే.. ఈ విషయమై ఇప్పటివరకు తారక్ స్పందించకపోవడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. మొన్నటి వరకు తెలుగు దేశం పార్టీకి ప్రచారం చేసిన తారక్.. ఇప్పుడు పార్టీ ఈ పరిస్థితిలో ఉంటె స్పందించకపోవడంతో ఈ విషయమై చర్చలు వాడివేడీగానే సాగుతున్నాయి. అయితే ఈ విషయమై తారక్ సన్నిహితుడు రాజీవ్ కనకాలను ఓ విలేఖరి ప్రశ్నించగా.. రాజీవ్ ఇచ్చిన సమాధానం వైరల్ అయ్యింది.
Advertisement
తారక్ ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టారని అన్నారు. కరోనా మరియు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్స్ కారణంగా నాలుగేళ్లు కెరీర్ స్లో అయ్యిందని.. అందుకే తారక్ ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి పెట్టి ఉంటారని రాజీవ్ అన్నారు. ఆయన స్పందించకపోవడానికి అసలు కారణం ఏంటో నాకు తెలియదు.. ఇప్పటివరకు మా ఇద్దరి మధ్య ఆ టాపిక్ అయితే రాలేదని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. భవిష్యత్ లో కచ్చితంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని అన్నారు. తారక్ సన్నిహితుడు రాజీవ్ ఈ విషయం పై ఇంత డైరెక్ట్ గా స్పందించాడు అంటే.. తారక్ కి తెలియకుండా జరిగే అవకాశం లేదనీ.. తారక్ నిజంగానే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
మరిన్ని..
రవితేజ మూవీలో రేణుదేశాయ్ పోషించిన హేమలత లవణం పాత్ర గొప్పదనం గురించి తెలుసా ?
Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు పెద్దలను మరిచిపోకూడదు
ఆస్కార్‌కి అక్షయ్ కుమార్ ‘మిషన్ రాణిగంజ్’ మూవీ..?