Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » RAJEEV KANAKALA : ట్రైన్ లో బాత్రూం ద‌గ్గ‌ర ప‌డుకున్నా..రాజీవ్ క‌న‌కాల ఎమోష‌న‌ల్…!

RAJEEV KANAKALA : ట్రైన్ లో బాత్రూం ద‌గ్గ‌ర ప‌డుకున్నా..రాజీవ్ క‌న‌కాల ఎమోష‌న‌ల్…!

by AJAY
Ads

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజీవ్ కనకాల. రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమా లో రాజీవ్ కనకాల విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనను గుర్తు చేసుకున్నారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి మరియు హీరో సుమన్ కలిసి సూర్యపుత్రుడు అనే సినిమాలో నటించారు.

Advertisement

rajeev kanakala

rajeev kanakala

అయితే ఆ సినిమాలో తాను కూడా ఓ క్యారెక్టర్ చేశానని చెప్పారు. సుమన్ మమ్ముట్టి కలిసి నటించే ఓ సీన్ లో త‌న‌ది కూడా ఒక పాత్ర ఉండేద‌ని రాజీవ్ కనకాల తెలిపారు. అయితే ఆ సినిమా షూటింగ్ చెన్నైలో జరిగిందని ఆ రోజుల్లో తాను చెన్నై వెళ్లడానికి ఎంతో ఇబ్బంది ప‌డేవాడిన‌ని చెప్పారు. తాను పుట్టింది చెన్నై లో అని కానీ పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే అని అందువల్ల తనకు చెన్నై పై ఎక్కువగా పట్టు లేదని తెలిపారు.

Ad

Advertisement

షూటింగ్ కు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా ట్రైన్ లోనే వెళ్ళేవాడిన‌ని అన్నారు. ఇక సూర్య‌పుత్రుడు సినిమాలో సుమ‌న్ మమ్ముట్టిల‌తో కలిసి చేసే ఒక్క సీన్ కోసం తను 40 సార్లు చెన్నై వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ కు అర్జెంట్ గా రావాలని కాల్ చేసే వారని చెప్పారు. అక్కడికి వెళ్ళాక మ‌రుస‌టి రోజు సాయంత్రం వరకూ చూస్తే షూటింగ్ కాస్తా క్యాన్సిల్ అయ్యిందని చెప్పేవార‌ని అన్నారు.

sumakanakala

sumakanakala

అలా ఆ సీన్ కోసం 40 సార్లు చెన్నై వెళ్లాన‌ని తెలిపారు. అంతేకాకుండా షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ రావాలంటే అప్పటికే ట్రైన్ లో సీట్లన్నీ బుక్ అయ్యేవని తెలిపారు. దాంతో తను జనరల్ బోగీలో ఎక్కాల్సి వ‌చ్చేద‌ని అందులోనూ సీట్లు లేకపోతే బాత్రూం దగ్గర కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయని నిద్ర వస్తే అక్కడే పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని రాజీవ్ కనకాల ఎమోషనల్ అయ్యారు.

ALSO READ : మెగాడాట‌ర్ విడాకుల అంశంపై కొత్త అనుమానాలు…!

Visitors Are Also Reading