Home » సుమతో విడాకుల ఇష్యూ గురించి రాజీవ్ కనకాల ఏమన్నారంటే..?

సుమతో విడాకుల ఇష్యూ గురించి రాజీవ్ కనకాల ఏమన్నారంటే..?

by Anji
Ad

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు యాంకర్లలో నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ. బుల్లితెర మాటల మాంత్రికురాలుగా పేరు సంపాదించుకున్న సుమ ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా భర్త రాజీవ్ కనకాలతో విభేదాలు వచ్చాయని.. డివోర్స్ అనే టాపిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమ.. కొన్ని వ్యక్తి గత కారణాల వల్ల విడిపోవాలని డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని సుమ చాలా సందర్భాల్లో క్లారిటీ ఇచ్చినప్పటికీ లాభం లేకుండా పోయింది. 

Advertisement

ఇప్పుడు ఇదే టాపిక్ పై రాజీవ్ కనకాల ఓపెన్ అయ్యారు. సుమకు తనకు విడాకుల విషయం కొత్త కాదని.. తాము విడాకులు తీసుకుంటున్నామని ఎప్పటి నుంచో వార్తలు ఎన్నో రకాలుగా రాసుకొచ్చారని పేర్కొన్నారు. అలాంటిది ఏమి లేదని చెబుతున్నప్పటికీ. వినిపించుకోవడం చెప్పారు రాజీవ్ కనకాల. ఇదే టాక్ మా అమ్మనాన్నలు ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఎక్కువ బాధ ఉండేదేమో అని చెప్పారు. సుమ ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోదు. కానీ తాను మాత్రం అంత తేలికగా తీసుకోలేనని చెప్పుకొచ్చారు రాజీవ్ కనకాల. 

Advertisement

ఇలాంటి రూమర్స్ మాకు అలవాటు అయిపోయాయి. వీటిని చూసి చిరాకు వస్తుంది. ఇలాంటి వార్తల వల్ల మాకు ఇబ్బంది లేదు.. కాకపోతే ఇబ్బంది పడుతున్నది మా పిల్లలు. స్కూళ్లలో, కళాశాలల్లో వాళ్ల ఫ్రెండ్స్ ఈ విషయాలను అడిగితే వాళ్లకు చాలా కష్టంగా ఉంటుంది కదా.. ఈ విషయంలో పిల్లలు చాలా సపర్ అయ్యారు అని రాజీవ్ కనకాల వెల్లడించారు.  సుమ, తాను విడిపోలేదు.. కలిసే ఉన్నామని చెప్పేందుకు ఆమె షోస్ కి వెళ్లాను. తన ఈవెంట్స్ కి కూడా వెళ్లాను. ఇటీవలే యూఎస్ కి వెళ్లినప్పుడు రీల్స్ కూడా చేశామని తెలిపారు. మా పిల్లలను దృష్టిలో పెట్టుకొని మా విడాకుల వార్తలను పుట్టించడం మానేస్తే బాగుంటుంది అని రాజీవ్ కనకాల కోరారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

నటుడు సముద్రఖని డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సీరియల్ ఏదో తెలుసా..?

అలనాటి హీరోయిన్ రాశి కెరీర్ ను నాశనం చేసింది ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading