Home » అలనాటి హీరోయిన్ రాశి కెరీర్ ను నాశనం చేసింది ఎవరో తెలుసా..?

అలనాటి హీరోయిన్ రాశి కెరీర్ ను నాశనం చేసింది ఎవరో తెలుసా..?

by Bunty

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించి “పెళ్లి పందిరి” సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించిన రాశి…ప్రస్తుతం సీరియల్స్ లలో, పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటిస్తోంది. ఇక రాశి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఆ డైరెక్టర్ చేసిన పని వల్లే నా కెరియర్ నాశనం అయిందని సంచలన కామెంట్స్ చేసింది.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు డైరెక్టర్ తేజ. ఇతను రాశికి “నిజం” సినిమాలో విలన్ భార్య క్యారెక్టర్ లో రాశిని ఎంపిక చేశాడు. ఈ సినిమా ఆఫర్ గురించి రాశికి చెప్పినప్పటికీ అసలు క్యారెక్టర్ ఏంటి అనే విషయాన్ని చెప్పలేదట. రాశి కూడా ఎలాంటి క్యారెక్టర్…ఏంటి… అనే విషయాన్ని తెలుసుకోకుండా సినిమాకి ఓకే చెప్పిందట. ఇక షూటింగ్ స్టార్ట్ అయిన సమయంలో ఆ క్యారెక్టర్ గురించి తెలిసి రాశి చేయనని కరాకండిగా చెప్పేసిందిగా.

నువ్వు ఈ సమయంలో సినిమా చేయనని చెబితే సినిమా మొత్తం ఆగిపోతుంది అని తేజ ఒత్తిడి చేయడంతో రాశి ఒప్పుకుందట. ఆ తర్వాత రాశి అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పింది. టాప్ హీరోయిన్ గా ఉన్న రాశి అలాంటి క్యారెక్టర్ లో నటించడంతో అభిమానులు ఒప్పుకోలేక పోయారు. దీంతో రాశిని అభిమానులు ఆదరించలేకపోయారు. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ లో నటించడంతో… ఆ సినిమా తర్వాత రాశికి ఎలాంటి సినిమా ఆఫర్లు రాకపోవడంతో… ఆ సినిమాలో నటించడం వల్లే నాకు సినిమా ఆఫర్లు తగ్గిపోయాయని రాశి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇండియా – పాక్ మ్యాచ్ కోసం ఆస్పత్రి బెడ్లూ

40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగల్ గా ఉండిపోయిన హీరోయిన్స్ !

MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

Visitors Are Also Reading